Puneeth Rajkumar: పునీత్ పార్ధీవదేహానికి నివాళులర్పించిన చిరంజీవి, వెంకటేష్ , శ్రీకాంత్, అలీ
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను చివరిసారి చూసేందుకు టాలీవుడ్ కదిలింది. పునీత్ హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది.

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను చివరిసారి చూసేందుకు టాలీవుడ్ కదిలింది. పునీత్ హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు పునీత్. ఆయన ను వెంటనే బెంగళూరు లోని విక్రమ్ హాస్పటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ పునీత్ తుది శ్వాస విడిచారు. పునీత్ పార్ధీవదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ఉంచారు. పునీత్ ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు కదిలారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ , ఎన్టీఆర్, రానా పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, హీరో శ్రీకాంత్, అలీ కొద్దీ సేపటి క్రితమే బెంగళూరు కంఠీరవ స్టేడియం చేరుకున్నారు. పునీత్ పార్ధీవదేహాన్ని సందర్శించిన చిరంజీవి, వెంకటేష్, అలీ, శ్రీకాంత్ నివాళులర్పించారు. పునీత్ అన్న శివ రాజ్ కుమార్ ఓదార్చారు చిరు, వెంకీ. చిరంజీవి మాట్లాడుతూ.. నేను బెంగళూరు ఎప్పుడొచ్చినా పునీత్ ను కలిసేవాడిని, ఇటీవల కూడా పునీత్ ను కలిశాను. చాలా మంచి వ్యక్తి, ఇలా సడన్ గా పునీత్ మరణం గురుంచి స్పందించాల్సి వస్తుందని అనుకోలేదు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని చిరు ఎమోషనల్ అయ్యారు. ఇక పునీత్ అంత్య క్రియలను ఆదివారం నిరవహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. పునీత్ పెద్ద కుమార్తె అమెరికా నుంచి రావడం ఆలస్యం అవడంతో పునీత్ అంత్యక్రియలు వాయిదా వేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :