Puneeth Rajkumar : నాన్న కోసం పరుగు పరుగునా.. బెంగళూరు చేరుకున్న పునీత్ పెద్ద కూతురు..
న్యూయార్క్‌లో చదువుతున్న పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి ఈరోజు (అక్టోబర్ 30) మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.
Puneeth Rajkumar : న్యూయార్క్‌లో చదువుతున్న పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి ఈరోజు (అక్టోబర్ 30) మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరింది. సాయంత్రం 4.15 గంటలకు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా బెంగళూరు కంఠీరవ స్డేడియంకు వచ్చారు. తండ్రి భౌతికకాయాన్ని చూసి ధృతి బోరున విలపించింది. తల్లిని హత్తుకొని కన్నీటి పర్యంతం అయ్యింది ధృతి. కాగా పై చదువులకోసం ధృతి రెండు నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు.
ఢిల్లీలో ధృతి విమాన మార్పునకు కర్ణాటక భవన్ అధికారులు సహకరించినట్లు సమాచారం. ధృతి బెంగళూరు వెళ్లేందుకు అధికారులు బోర్డింగ్ పాస్ సిద్ధం చేశారు. నటుడు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఈరోజు సాయంత్రం (అక్టోబర్ 30) ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు.
జిమ్‌లో వర్కౌట్గుం చేస్తున్న సమయంలో గుండెపోటుతో పునీత్ కన్నుమూశారు. పునీత్ తుది దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం పునీత్ అంత్యక్రియలు జరగనున్నాయని.. ఈ విషాదకర పరిస్థితుల్లో పునీత్ అభిమానులు అసౌకర్యానికి గురికాకూడదని. ప్రజలు శాంతియుతంగా, సంయమనంతో వ్యవహరించి నివాళులర్పించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :