Mahesh Babu Krihna: నాన్నా… నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను.. తండ్రి పుట్టిన రోజున ప్రిన్స్ ఎమోషన్ పోస్ట్..
Mahesh Babu Krihna: తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమా గతిని మార్చిన ఎన్నో సినిమాలకు కృష్ణ నాంది పలికారు. తెలుగు సినిమా...
Mahesh Babu Krihna: తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమా గతిని మార్చిన ఎన్నో సినిమాలకు కృష్ణ నాంది పలికారు. తెలుగు సినిమా ప్రస్థానాన్ని ఆయన పేరు లేకుండా పూర్తి చేయలేము. అంతలా సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. సినీ పరిశ్రమకు పద్మభూషణ్‌తో పాటు మరెన్నో అవార్డులు ఆయనను వరించాయి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నేడు (మే 31). నేడు సూపర్ స్టార్ 78వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ తనయుడు.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భాన్నిపురస్కరించుకొని మహేష్ ట్వీట్ చేశారు. తండ్రి కృష్ణతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. `పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా.. నా ముందుండి నన్ను నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను` అంటూ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు మహేష్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనమూ కోరుకుందాం.
మహేష్ బాబు చేసిన ట్వీట్..
Happy birthday Nanna.. Thank you for always showing me the best way forward.. Love you more than you’ll ever know ♥️♥️♥️ pic.twitter.com/Mm3J0OA8by
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2021
Also Read: Rao Ramesh: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కర్ణన్ రీమేక్.. కీలక పాత్రలో విలక్షణ నటుడు రావు రమేష్..
Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే.. సంక్రాంతి బరిలోకి పవర్ స్టార్ సినిమా..