Krishna Birthday: సూపర్ స్టార్ కృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన.. కోడలు నమ్రత, మనవరాలు సితార..
Krishna Birthday: సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కృష్ణకు ఆయన అభిమానులతో పాటు...
Krishna Birthday: సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కృష్ణకు ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో మహేష్ బాబు తన తండ్రిపై ఉన్న ప్రేమను వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని మహేష్ సతీమణి నమత్ర శిరోద్కర్‌తో పాటు కూతురు సితారా కూడా సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
హ్యాపీ బర్త్‌డే మామయ్య గారు..
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన నమ్రత. ఆయన యంగ్ ఏజ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. `నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరైన మామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరంటే మాకు ఎంతో ఇష్టం` అంటూ క్యాప్షన్ జోడించారు.
లవ్‌యూ తాతయ్య..
View this post on Instagram
ఇక మహేష్ గారాల పట్టి సితార.. తన తాతయ్యకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. హ్యాపీ బర్త్‌డే తాత గారు. మీరు ఇప్పటి వరకు జరుపుకోనంత వేడుకగా ఈ పుట్టిన రోజును జరుపుకోవాలి. లవ్ యూ సో మచ్. అంటూ క్యాప్షన్ జోడించింది.
Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే.. సంక్రాంతి బరిలోకి పవర్ స్టార్ సినిమా..
Rao Ramesh: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కర్ణన్ రీమేక్.. కీలక పాత్రలో విలక్షణ నటుడు రావు రమేష్..