Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే.. సంక్రాంతి బరిలోకి పవర్ స్టార్ సినిమా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు పవన్.
Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు పవన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్హీరోగా దర్శకుడు క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు.
చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్ కి మంచి అనుభవం ఉంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ .. ‘మణికర్ణిక’ వంటి సినిమాలను ఆయన డైరెక్ట్ చేశారు. అందువలన ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత ఎ.ఎమ్.రత్నం మాట్లాడుతూ .. “ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఈ సినిమా షూటింగ్ కొనసాగింది .. ఆ తరువాత కరోనా ఉద్ధృతి కారణంగా ఆగిపోయింది. తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాము. సెట్లో అడుగుపెట్టడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. అని తెలిపారు. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ .. అర్జున్ రాంపాల్ కూడా పాల్గొంటారు. ‘సంక్రాంతి’ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాము” అని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :