AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : టాలీవుడ్‌లో టగ్‌ఆఫ్ వార్.. 13 రోజులుగా నో షూటింగ్స్..

టాలీవుడ్‌లో టగ్‌ఆఫ్ వార్. నిర్మాతలు వర్సెస్ కార్మిక సంఘాలు. ఎవరివైపునుంచి వాళ్లు రెండువైపులా తెగేదాకా లాగుతున్నారు. నిర్మాతలే సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారా.. కార్మికులే వేతనాల విషయంలో మంకుపట్టు పడుతున్నారా? ఇప్పటికీ అదే కన్‌ఫ్యూజన్. ఏదైతేనేం... 13రోజులుగా ఆగిపోయిన షూటింగులు ఎప్పడు రీస్టార్ట్ ఔతాయో తెలీని గందరగోళం.

Tollywood : టాలీవుడ్‌లో టగ్‌ఆఫ్ వార్.. 13 రోజులుగా నో షూటింగ్స్..
Tollywood
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2025 | 9:00 PM

Share

సమ్మె పదవరోజున ఫిలిమ్‌ఛాంబర్‌లో దిల్‌రాజు సమక్షంలో జరిగిన కీలక భేటీ ఏమీ తేల్చలేకపోయింది. పాతవి, కొత్తవీ కలిపి నాలుగు కండిషన్లు పెట్టి అవి తేలితేనే వేతనాల పెంపు, అప్పటిదాకా ఎవ్వరూ మీడియాతో మాట్లాడవద్దు అని ఒట్టేయించుకున్నారు నిర్మాతలు. కానీ, శుక్రవారం కొందరు ప్రొడ్యూసర్లు ప్రెస్‌మీట్ పెట్టడంతో కార్మిక సంఘాల్లో కాక రేగింది. వర్కర్స్‌కి వ్యతిరేకం కాదు అంటూనే వాళ్లు చేసిన కొన్ని కామెంట్లపై సీరియస్ ఔతోంది ఫెడరేషన్. 50 ఏళ్లనుంచి లేని కండిషన్లు ఇప్పుడు పెడుతున్నారు, కార్మికుల్ని తప్పుదోవ పట్టిస్తున్నది, సమస్యను నానుస్తున్నది ఎవరు? మీరామేమా అంటూ ఫైరౌతున్నారు.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

రెండువారాల పాటు షూటింగులు ఆగిపోతే ఏ నిర్మాతకైనా బడ్జెట్‌ పెరిగి నష్టపోవడం ఖాయం. ఇటు డైలీ వేజెస్ మీద ఆధారపడి బతికే సినిమా కార్మికులు పని దొరక్క పూట గడవక ఇక్కట్ల పాలౌతున్నారు. చర్చలకు సిద్ధంగా ఉన్నాం.. నిర్మాతలే అందుబాటులో లేరనేది ఫెడరేషన్ వాదన. ఫిలిమ్ చాంబర్ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తూనే కాలం గడిచిపోతోంది. ఇటు ప్రొడ్యూసర్ల పక్షాన ఎటువంటి సానుకూల స్పందనా లేదు.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

బంతి ఎవరి కోర్టులో ఉంది..? ఈ పరిస్థితుల్లో మలివిడత చర్చలు ఎప్పుడు మొదలౌతాయ్? సమ్మె ఎప్పటికి ముగుస్తుంది? ఛాంబర్ నుంచి పిలుపు రాకపోతే మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి యాక్షన్ ప్లాన్ చెబుతామంటున్నారు ఫెడరేషన్ నేతలు. మరి.. నిర్మాతలు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..