- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Husband Most popular Villian In Tollywood, She Is Kareena Kapoor
Heroine: ఒకప్పుడు టాప్ హీరోయిన్.. భర్త ఇప్పుడు టాలీవుడ్ విలన్.. ఒక్కో సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్..
ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. సినీరంగంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మరోవైపు ఆమె భర్త టాలీవుడ్ లో పవర్ ఫుల్ విలన్.
Updated on: Aug 16, 2025 | 8:49 PM

కరీనా కపూర్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె సంచలనం. షారుఖ్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. వయసు పెరిగినా అందం, రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్లు తీసుకుంటుంది.

దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది క్రూ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ది బకింగ్ హామ్ మర్డర్స్ సైతం ప్రశంసలు అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస హిట్లు అందుకుంటుంది.

1980 సెప్టెంబర్ 21న జన్మించిన కరీనా.. ఆమె తండ్రి రణధీర్ కపూర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన సూపర్ స్టార్. చిన్న వయసులోనే హీరోయిన్ కావాలనే కోరిక ఉండేదట. ఆమె తల్లి బబిత.. కహో నా ప్యార్ హై సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించిన కరీనా.. సైఫ్ అలీఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.485 కోట్లు. ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అలాగే బ్రాండ్ ప్రమోషన్ తో రూ.5 కోట్లు తీసుకుంటుంది.

ప్రస్తుతం అందం, ఫిట్నెస్ విషయంలోనూ కుర్రహీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే దేవర సినిమాలో విలన్ గా నటించారు.




