Tollywood: సినీ కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం.. చర్చకు రానున్న అంశాలివే..

Telugu Film Industry Strike: వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో సమ్మెబాట పట్టిన సినీ కార్మికులు గురువారం తమ ఆందోళనను విరమించారు. జీతాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో యథావిధిగా

Tollywood: సినీ కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం.. చర్చకు రానున్న అంశాలివే..
Tollywood
Follow us

|

Updated on: Jun 24, 2022 | 7:48 AM

Telugu Film Industry Strike: వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో సమ్మెబాట పట్టిన సినీ కార్మికులు గురువారం తమ ఆందోళనను విరమించారు. జీతాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో యథావిధిగా సినిమా చిత్రీకరణలకు హాజరుకానున్నట్టు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకులు వెల్లడించారు. కాగా వేతనాల పెంపుపై రెండు రోజుల నుంచి సినీ కార్మిక సంఘాలు ఆందోళనబాట పట్టాయి. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yadav) చొరవతో నిర్మాతల మండలితో చర్చలు జరిపారు. సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2గంటల పాటు చర్చించారు. కార్మికుల వేతనాలపై దిల్‌రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించింది.

ఇందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్‌లో సినీ కార్మికుల సమస్యలపై కీలక సమావేశం జరగనుంది. నిర్మాత దిల్‌రాజు ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో సినీ కార్మికుల వేతనాలు, సమస్యలపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. జీతాలు ఎంతమేర పెంచాల‌న్న దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ఫిల్మ్‌ ఛాంబర్‌, ఫెడరేషన్‌ సభ్యులు హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..