AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అటు హీరోలుగా చేస్తూనే.. ఇటు నిర్మాత‌లుగా.. రెండు చేతులా సంపాదిస్తోన్న టాలీవుడ్ హీరోలు వీరే..

స్టార్ హీరోలందరూ నిర్మాతలుగా కూడా బిజీ అవుతున్నారు. కరోనా ఫియర్స్‌ని లెక్క చేయకుండా.. ఇండస్ట్రీలో తమ డ్యూయల్ రోల్‌ని కంటిన్యూ చేసుకుంటున్నారు.

Tollywood: అటు హీరోలుగా చేస్తూనే.. ఇటు నిర్మాత‌లుగా.. రెండు చేతులా సంపాదిస్తోన్న టాలీవుడ్ హీరోలు వీరే..
Tollywood
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2021 | 8:45 AM

Share

స్టార్ హీరోలందరూ నిర్మాతలుగా కూడా బిజీ అవుతున్నారు. కరోనా ఫియర్స్‌ని లెక్క చేయకుండా.. ఇండస్ట్రీలో తమ డ్యూయల్ రోల్‌ని కంటిన్యూ చేసుకుంటున్నారు. మెగాపవర్‌స్టార్‌ నుంచి నేచురల్ స్టార్ దాకా.. ఇంక్లూడింగ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ.. పైసా వసూల్ కాన్సెప్ట్‌కి కమిటయ్యే వున్నారు. హీరోగా కెరీర్ కాస్త పల్చబడ్డప్పటికీ.. ప్రొడ్యూసర్‌గా మాత్రం బలం చాటుకుంటున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. తాను, తారక్‌ ఇద్దరూ ఎవరితో సినిమా చేస్తున్నా.. ప్రొడక్షన్ కంపెనీల్లో ఎన్టీయార్ ఆర్ట్స్‌ పేరు మాత్రం మాండేటరీ అవుతోంది. కొరటాల శివతో ఎన్టీయార్‌ అనౌన్స్ చేసిన థర్టీయత్ మూవీకి కల్యాణ్‌రామ్‌ కూడా వన్నాఫ్‌ది ప్రొడ్యూసర్స్. తన రౌడీ బ్రాండ్‌ని బ్రహ్మాండంగా నడుపుకుంటూనే.. నిర్మాతగా కూడా హెక్టిక్ షెడ్యూల్‌ క్రియేట్ చేసుకుంటున్నారు డియర్ కామ్రేడ్. తమ్ముడు ఆనంద్‌ దేవరకొండతో పుష్పక విమానం ప్రొడ్యూస్ చేస్తున్నారు. అటు.. న్యూ కమర్స్‌తో పృథ్వీసేన అనే కొత్త డైరెక్టర్‌తో మరో చిన్న సినిమా ప్లాన్ చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ.

వకీల్‌సాబ్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. ఆ టెంపో కంటిన్యూ చేస్తున్నపవర్‌స్టార్… నేను హీరోనే కాదు ప్రొడ్యూసర్‌ని కూడా అని రీసెంట్‌గా ఓ గ్రాండ్ అనౌన్స్‌మెంట్‌తో స్వయంగా గుర్తు చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో డీల్ పెట్టుకుని 15 సినిమాలు నిర్మించబోతున్నట్టు ప్రకటించింది పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్ వర్క్స్. ఒకవైపు తన సినిమాల్ని చక్కదిద్దుకుంటూ.. మరో చేత్తో ఇద్దరు తనయుల కెరీర్‌ని మోనిటర్ చేస్తూ.. ప్రొడ్యూసర్‌గా కూడా బిజీ అవుతున్నారు కింగ్ నాగార్జున. అన్నపూర్ణ బేనర్‌పై రాజ్‌తరుణ్‌తో ఓ సినిమా చర్చల్లో వుంది. ఉయ్యాల జంపాలా తర్వాత తనకు మళ్లీ మన్మథుడి చేతి మీదే బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నారు రాజ్‌తరుణ్. కొణిదెల బేనర్‌పై కొరటాలతో ఆచార్య మూవీని ప్రొడ్యూస్ చేస్తూనే మరికొన్ని ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్‌ని లైన్లో పెడుతున్నారు చెర్రీ. విక్టరీ హీరో వెంకటేష్‌తో కొణిదెల క్యాంప్‌లో ఓ సినిమా రాబోతోందట. అటు నేచురల్ స్టార్ నానీ కూడా ప్రొడ్యూసర్‌గా టాప్‌గేర్‌లో నడుస్తున్నారు. హిట్‌ సినిమాని హిట్‌ చేసుకోవడంతో ఆగిపోకుండా.. ఇప్పుడు హిట్ సెకండ్ కేస్‌ని కూడా షురూ చేశారు.

వెంకటాద్రి టాకీస్ పేరుతో సొంత బేనర్‌ పెట్టి సందీప్ కిషన్‌ కూడా ప్రొడ్యూసర్ అవతారమెత్తారు. తన A1 ఎక్స్‌ప్రెస్‌ మూవీతో పాటు.. కమెడియన్‌ సత్యను హీరోగా పెట్టి వివాహ భోజనంబు అనే మూవీని కూడా నిర్మిస్తున్నారు సందీప్. అడివి శేష్‌తో మేజర్ అనే ప్రిస్టీజియస్ మూవీ చేస్తున్న మహేష్‌బాబు క్యాంప్‌ కూడా… ఫ్యూచర్‌ కోసం మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌ని పరిశీలిస్తున్నారట. సో.. రెండు చేతులా సంపాదించడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు మన స్టార్‌ హీరోలు.

Also Read: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు అనుకోని నష్టం.. వర్షం కారణంగా దెబ్బతిన్న భారీ సెట్

రామ్ చరణ్ కు జోడీగా మాస్టర్ బ్యూటీ.. శంకర్ సినిమాలో హీరోయిన్ గా అందాల మాళవిక మోహన్

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ