Malavika Mohanan: రామ్ చరణ్ కు జోడీగా మాస్టర్ బ్యూటీ.. శంకర్ సినిమాలో హీరోయిన్ గా అందాల మాళవిక మోహన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో..
Malavika Mohanan:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడియింది. త్వరలోనే తిరిగి షూటింగ్ ను ప్రారంభించనున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తికావచ్చింది. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే శంకర్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు చరణ్.
డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ సినిమాను పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే అనూహ్యంగా భారతీయుడు 2 సినిమా వివాదంలో చిక్కుకుంది.లైకా వారి వివాదం కొనసాగుతూ ఉండగానే రామ్ చరణ్ తో శంకర్ సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు మొదలవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఆల్రెడీ శంకర్ ఆ పనులను పూర్తి చేశాడట. కథాపరంగా ఆయన కొన్ని లొకేషన్స్ ను అనుకున్నాడట. కరోనా ప్రభావం తగ్గగానే వెళ్లి చూసి ఫిక్స్ చేయనున్నాడని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమా ను నిర్మించబోతున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఈ ముద్దుగుమ్మే అంటూ ఓ పేరు వినిపిస్తుంది. ఇటీవల విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో మనసు దోచేసిన మాళవిక మోహనన్ ఈ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. శంకర్ సినిమాలో హీరోయిన్ అంటే అందాల ఆరబోతకు కొదవ ఉండదు. మరి ఇప్పుడు చెర్రీ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు గాలం వేస్తుందేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :