AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అయ్య బాబోయ్.. ఈ అమ్మాయి ఎంత క్యూట్‎గా ఉందో.. చిన్నప్పటి వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..

సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి చిన్న విషయం వైరలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా అప్డేట్స్, సాంగ్స్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక సెలబ్రెటీల విషయం చెప్పక్కర్లేదు. సినీతారల సినిమా విషయాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరల్ గా మారుతాయి.

Tollywood: అయ్య బాబోయ్.. ఈ అమ్మాయి ఎంత క్యూట్‎గా ఉందో.. చిన్నప్పటి వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2024 | 8:43 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి యూత్‏లో ఉన్న క్రేజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో ఎంతో క్యూట్‏గా కనిపిస్తున్న ఆ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్. తనే టాలీవుడ్ అడియన్స్ ఫేవరేట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో స్టార్ హీరోస్ సరసన నటించి బిజీగా మారిన ముద్దుగుమ్మ. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత భారీ బడ్జెట్ చిత్రాల్లో భాగమయ్యింది. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది రకుల్.

ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 చిత్రంలో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న రకుల్.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తుంది. తాజాగా ఇటీవల చిల్డ్రన్స్ డే సందర్భంగా తన చిన్ననాటి వీడియో షేర్ చేసింది. “నా పెళ్లిరోజు కానుకగా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన బహుమతి ఇది. నా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్న ఈ వీడియో నాకు ఎంతో ప్రత్యేకం. చిన్నప్పటి మెమొరీస్ ఎప్పటికీ ప్రత్యేకమే. ఎప్పుడూ నవ్వుతూ.. ఆడుతూ.. మీలోని చిన్నతనాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉండండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

రకుల్ షేర్ చేసిన ఆ వీడియోలో ఆమె చిన్నప్పుడు ఆడుకోవడం.. డ్యాన్స్ చేయడం.. ఐస్ క్రీమ్ తినడం.. బర్త్ డే కేక్ కటింగ్.. ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చాలా రోజులుగా రకుల్ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. అలాగే అటు హిందీలోనూ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ నెట్టింట మాత్రం సందడి చేస్తుంది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?