Raj Tarun: రాజ్ తరుణ్ కేసులో ఊహించని ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
లావణ్య తన కంప్లేంట్‌లో మాల్వీ మల్హోత్రతో పాటు ఆమె కుటుంబసభ్యులపై కూడా ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్‌కు తాను దూరం కావాలని వాళ్లు బెదిరిస్తున్నారని వాపోయారామె. రాజ్‌తరుణ్ లేకపోతే తాను ఉండలేననీ.. అతనితోనే కలసి బతకాలని కోరుకుంటున్నట్టు కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా లావణ్య కంప్లేంట్ తెరపైకి రాగానే అలా రాజ్ తరుణ్ తన వెర్షన్ విన్పించారు
హీరో రాజ్ తరుణ్‌పై లావణ్య అనే యువతి నార్సింగ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్‌తరుణ్ తను 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నారు. కానీ.. ఇప్పుడు మాల్వీ మల్హోత్ర ( తిరగబడారా సామి సినిమా హీరోయిన్) అనే యువతి మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని రాజ్‌తరుణ్‌పై కంప్లేంట్ చేశారామె. అంతేకాదు మాల్వీ మల్హోత్ర ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని.. తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాల్వీ మల్హోత్ర – రాజ్‌తరుణ్ ఇద్దరూ తిరుగబడరస్వామిలో కలిసి నటించారు. లావణ్య ఆరోపిస్తున్నట్టుగా మాల్వీ మల్హోత్రతో రాజ్ తరుణ్ రిలేషన్ ఫిస్‌లో ఉన్నారా? పెళ్లి చేసుకోబుతున్నారా?
లావణ్య తన కంప్లేంట్‌లో మాల్వీ మల్హోత్రతో పాటు ఆమె కుటుంబసభ్యులపై కూడా ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్‌కు తాను దూరం కావాలని వాళ్లు బెదిరిస్తున్నారని వాపోయారామె. రాజ్‌తరుణ్ లేకపోతే తాను ఉండలేననీ.. అతనితోనే కలసి బతకాలని కోరుకుంటున్నట్టు కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా లావణ్య కంప్లేంట్ తెరపైకి రాగానే అలా రాజ్ తరుణ్ తన వెర్షన్ విన్పించారు. సహజీవనం నిజమే. కానీ అది ఒన్స్ అపానే టైమ్. ఇప్పుడు తను మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉందని.. డబ్బు కోసం తనను బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని ఆరోపించారాయన. మరి ఏది నిజం? ఎవరు నిజం? రిలేషన్ షిప్ వివాద ఫ్రేమ్ డ్రగ్ రీల్ అండ్ రోల్ ఏంటీ? కథ మాములుగా లేదు బయ్యా.. సినిమాకు మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి. చివరాఖరకు ఇది ఏ కథా సిత్రమ్ అవుతుందనే చర్చ జోరందుకుందిప్పుడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. లావణ్యకు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజ్ తరుణ్ పై ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని పోలీసులు ఆదేశిస్తూ.. ఆమెకి 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసుల తర్వాత లావణ్య పోలీసులకు రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది. ఇంతవరకు లావణ్య పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాజ్ తరుణ్ లావణ్య పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందని చెప్పాడు. దీనిని లావణ్య ఖండించింది. నార్సింగ్ పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అతను వస్తాడు అని తెలిపింది లావణ్య.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.