Alekhya: ‘ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు!..’ అలేఖ్య తారకరత్న ఎమోషనల్
తారకరత్న మరణాంతరం కూడా అలేఖ్య తన పిల్లలతో విడిగానే ఉంటుంది. తారకరత్న పేరెంట్స్ ఆమెను గానీ, పిల్లల్ని గానీ అంగీకరించలేదని కొందరు చెబుతుంటారు. ఈ క్రమంలో.. కుటుంబం గురించి అడిగిన ప్రశ్నకు చాలా ఎమోషనల్‌గా ఆన్సర్ ఇచ్చారు అలేఖ్య.
దివంగత తారకరత్న, అలేఖ్యలది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే. అయితే వారి వివాహాన్ని తారకరత్న తల్లిదండ్రులు అంగీకరించలేదు. అప్పటినుంచి తారకతర్న.. తన భార్యా పిల్లలతో కలిసి కుటుంబానికి దూరంగానే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, ఇతర కార్యక్రమాల్లో కూడా తారకరత్న దంపతులు కనిపించలేదు. అయితే బాలకృష్ణ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తారకతర్నతో సన్నిహితంగానే మెలిగేవారు. కాగా తారకతర్న విషాద మరణాంతరం కూడా అలేఖ్య.. అత్తమామలు ఇంట్లో కాకుండా విడిగానే ఉంటుంది.
తాజాగా అలేఖ్య తన ఇన్ స్టా ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ కుటుంబం గురించి ఓ ప్రశ్న అడిగాడు. ‘తారకరత్న వాళ్ల తల్లిదండ్రులు.. మిమ్మల్ని, పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం ఇంకా ఉందా?’ అని ప్రశ్నించగా.. అలేఖ్య చాలా పరిణితితో కూడిన సమాధానం ఇచ్చింది. ఆమె లైఫ్‌లో ఎంత పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటారనే ఈ సమాధానం ద్వారా గ్రహించవచ్చు.
“నమ్మకమే మమ్మల్ని ఇన్నేళ్లు ముందుకు సాగేలా చేసింది. ఆ విషయంలో తారకరత్న ఎప్పుడూ తన నమ్మకాన్ని కోల్పోలేదు.. నేను అదే దృక్ఫథంతో ముందుకు సాగుతున్నాను.. ఏదో ఒక రోజు కచ్చితంగా అది జరుగుతుంది.. నాకు నమ్మకం ఉంది.. పిల్లలకి ఓ కుటుంబం ఉంటుంది అంటూ ఉంటుంది..” అని సమాధానమిచ్చారు అలేఖ్య.
తారకరత్న గత ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లోకేష్ యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నను బతికించేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి అలేఖ్య సోషల్ మీడియాలో తన భర్త తారకరత్నని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతునే ఉన్నారు. అలేఖ్య, పిల్లలకు అండగా నందమూరి బాలకృష్ణ, విజయసాయి రెడ్డి నిలబడుతున్నారు. ఏ కష్టం వచ్చినా కూడా ఆ ఇద్దరూ తమకు తోడుగా ఉంటారని గతంలో ఓ సందర్భంలో అలేఖ్య పేర్కొన్నారు. ఇక తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి చాలా దగ్గరి బంధుత్వం ఉంది. అలేఖ్య విజయసాయి రెడ్డి భార్య.. చెల్లెలు కూతురు. అంటే విజయసాయి రెడ్డికి అలేఖ్య కూతురు వరుస అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.