Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేస్‌లో కీలక మలుపు.. నేడు ఈడీ విచారణకు నవదీప్..
టాలీవుడ్ డ్రగ్స్ కేస్ రోజుకొక మలుపు తిరుగుతోంది. సినిమా తరాల పై గట్టిగానే ఫోకస్ పెట్టారు ఈడీ అధికారులు. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే నవదీప్ ను పలు సార్లు ఈడీఅధికారులు విచారించారు. నేడు మరోసారి ఈ.డి ఎదుట హీరో నవదీప్ హాజరుకానున్నారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరుకాలేదు నవదీప్.
టాలీవుడ్ డ్రగ్స్ కేస్ రోజుకొక మలుపు తిరుగుతోంది. సినిమా తరాల పై గట్టిగానే ఫోకస్ పెట్టారు ఈడీ అధికారులు. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే నవదీప్ ను పలు సార్లు ఈడీఅధికారులు విచారించారు. నేడు మరోసారి ఈడీ ఎదుట హీరో నవదీప్ హాజరుకానున్నారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరుకాలేదు నవదీప్.
తాజాగా గుడిమల్కపుర్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు విచారించారు. నవదీప్ కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ల తో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పలువురు నైజీరియన్ లను బెంగుళూరు లో అరెస్ట్ చేశారు నార్కోటిక్ పోలీసులు. మరోవైపు నవదీప్ మొబైల్ ను సీజ్ కూడా చేశారు అధికారులు.
నేడు నవదీప్‌తో డ్రగ్ పెడలర్స్ తో ఉన్న సంబంధాలు, బ్యాంక్ లావాదేవీల పై విచారించనున్నారు ఈడీ అధికారులు. అయితే ఈడీ ఎదుట నవదీప్ హాజరు అవుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నవదీప్ ను విచారించే క్రమంలో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..