AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: కాంతార సినిమాలో ఎలాంటి లోపాలు కనిపించలేదు.. ఆమెకు హాట్యాఫ్.. రిషబ్ శెట్టి మూవీపై పరుచూరి రివ్యూ..

కాంతార సినిమా అత్యద్భుతంగా ఉందని.. ఇందులో ఎలాంటి లోపాలు కనిపించలేదని అన్నారు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఇంతటి అద్భుతమైన సినిమాను తాను థియేటర్లలో చూడలేకపోయానని... అది తన బ్యాడ్ లక్ అన్నారు.

Kantara: కాంతార సినిమాలో ఎలాంటి లోపాలు కనిపించలేదు.. ఆమెకు హాట్యాఫ్.. రిషబ్ శెట్టి మూవీపై పరుచూరి రివ్యూ..
Kantara
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2022 | 12:55 PM

Share

కన్నడ నటుడు కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం దేశవ్యాప్తంగా సెన్సెషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ముందుగా కర్ణాటకలో విడుదలైన ఈ సినిమా.. ఆ తర్వాత తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, మలయాళం భాషలలో డబ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. కర్ణాటక ఆదివాసీల సంప్రదాయం.. సంస్కృతి ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుంటుంది. అలాగే రిషబ్ శెట్టి నటనకు..టేకింగ్ పై ప్రజలే కాదు.. సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.  క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన ప్రతి ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పించింది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందని.. ఇందులో ఎలాంటి లోపాలు కనిపించలేదని అన్నారు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఇంతటి అద్భుతమైన సినిమాను తాను థియేటర్లలో చూడలేకపోయానని… అది తన బ్యాడ్ లక్ అన్నారు. ఇటీవల ఈ  కాంతార  చిత్రాన్ని చూసిన ఆయన.. పరుచూరి పలుకులు వేదికగా కాంతార సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ” ఈ సినిమా గురించి ముందు ఆత్మలకు సంబంధించినది అనుకున్నాను..కానీ విశేష ప్రేక్షకాదరణ పొందడంతో ఇటీవల ఈ మూవీని చూశాను . నాకు చాలా నచ్చింది. కర్ణాటకలోని ఓ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఇదొక అభ్యుధాత్మకమైన చిత్రం. మన తెలుగులో వచ్చిన మా భూమి లాంటి చిత్రం ఇది. ఆ సినిమాలు ప్రజలు పోరాడారు. ఇందులో ఓ భూతకోల కళాకారుడు పోరాటం చేశాడు. ఇందులో ఎన్నో విషయాలను మెచ్చుకోవాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లై. రిషబ్ శెట్టి.. కథ, కథనం అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమా ప్రథమార్థం చూసినప్పుడు జమిందారే విలన్ అని ఎవరు అనుకోరు. అటవీ అధికారే ప్రతినాయకుడు అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

కానీ అడవి మీద కన్ను వేసింది జమిందారే అని చూపించి.. సెకండాఫ్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. జమిందార్ పాత్రదారిగా అచ్యు్త్ కుమార్ నటన అదిరిపోయింది. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి నటన అద్భుతం. ముఖ్యంగా తల్లిపాత్ర పోషించిన ఆమెను ఏ నటితో పోల్చాలో అర్థం కావడం లేదు. ఆమె సినిమా నటి అంటే ఎవరూ నమ్మరు. అడవిలో ఉండే అమ్మాయి ఈ పాత్ర పోషించారా అనే భావన కలిగేంత సహజంగా సినిమాలో లీనమై పోయారు. ఆమెకు నిజంగా హ్యాట్సాఫ్. క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంది. నటన, స్క్రీన్ ప్లే, కథ, కథనం ఇలా ఏ విషయంలోనూ లోపాలు కనిపించలేదు. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించారు ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.