Karate Kalyani : బిగ్ బాస్4 కంటిస్టెంట్ ఇంట విషాదం.. పుట్టెడు దుఃఖంలో కరాటే కళ్యాణి

సినిమా ఇండస్ట్రీలోచాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన కరాటే కళ్యాణి ఇంట విషాదం చోటు చేసుకుంది. కరాటే కళ్యాణి తండ్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న

Karate Kalyani : బిగ్ బాస్4 కంటిస్టెంట్ ఇంట విషాదం.. పుట్టెడు దుఃఖంలో కరాటే కళ్యాణి
Karate Kalyani
Follow us
Rajeev Rayala

| Edited By: Team Veegam

Updated on: Mar 23, 2021 | 11:52 AM

Karate Kalyani : సినిమా ఇండస్ట్రీలోచాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన కరాటే కళ్యాణి ఇంట విషాదం చోటు చేసుకుంది. కరాటే కళ్యాణి తండ్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. దీంతో కరాటే కళ్యాణి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక కరాటే కళ్యాణి పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సినిమాల్లో ఆమె అలరించారు. వి వి వినాయక్ తెరకెక్కించిన రవితేజ కృష్ణ సినిమాలో బాబీ అంటూ కరాటే కళ్యాణి చెప్పిన డైలాగ్ లు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే సమాజంలో జరిగే అన్యాయాలపైనా కూడా కరాటే కళ్యాణి చాలా సార్లు స్పందించారు.బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగు పెట్టిన కరాటే కళ్యాణి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ‘గోరంత దీపం’, ‘ముత్యాల ముగ్గు’, ‘మధుమాసం’ వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.నటి కాకముందు కరాటే కళ్యాణి.. హరికథ కళాకారిణిగా ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చారు.ఇక రాజకీయాల్లోనూ రాణించాలని చూసారు కళ్యాణి త్వరలో రాజకీయాల్లోకి వస్తానంటూ ఆమె ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె తండ్రి మరణించడంతో కుటుంబసబులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు కల్యాణిని సోషల్ మీడియాద్వారా పరామర్శిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Janhvi Kapoor : జాన్వీ కపూర్ ను ముద్దడిగిన అభిమాని.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన బ్యూటీ

Vijay Sethupathi : బుల్లితెరపై సందడి చేయనున్న మక్కల్ సెల్వన్.. త్వరలోనే టీవీషోతో రానున్న విజయ్ సేతుపతి..

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…