సీఎం జగన్‌ నుంచి టాలివుడ్‌ పెద్దలకు పిలుపు.. కలవనున్న మెగాస్టార్ చిరంజీవి బృందం

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడానికి...

సీఎం జగన్‌ నుంచి టాలివుడ్‌ పెద్దలకు పిలుపు.. కలవనున్న మెగాస్టార్ చిరంజీవి బృందం


మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడానికి ఎదురు చూస్తున్న చిరంజీవి బృందానికి ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 20న మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్‌ రాజు, సురేశ్‌బాబు తదితరులు జగన్‌ను కలవనున్నారు. కరోనా కష్టకాలంలో తెలుగు చిత్రపరిశ్ర ఎదుర్కొన్న సమస్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకువస్తామని చిరంజీవి నేతృత్వంలోని బృందం ఇంతకుముందు ఏపీ సమాచార శాఖ మంత్రి నాని ద్వారా ప్రయత్నించారు.

ఆయన ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. ఈ నెల 20న అపాయింట్‌మెంట్ ఇచ్చారు. పేర్ని నాని నుంచి సమాచారం అందడంతో 20న జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సారథ్యంలోని బృందం కలుస్తుంది. బృందం అక్కినేని నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు.

ఇక, జగన్ దృష్టికి తీసుకెళ్లనున్న అంశాలపై చిత్రపరిశ్రమ ప్రముఖులు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. వీటిలో కొత్త సినిమాలకు బెనిఫిట్‌ షోలు వేసే అవకాశం ఇవ్వాలనీ, నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించాలనీ, అదే విధంగా గ్రేడ్‌-2 కేంద్రాల్లో నేల టిక్కెట్టుకు పది రూపాయలు.. కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని ముఖ్యమంత్రి జగన్‌ను కోరేందుకు చిరంజీవి బృందం సన్నద్ధమవుతోందని సమాచారం. కాగా.. ఇటీవల ప్రభుత్వమే నేరుగా సినీ టిక్కెట్ల విక్రయానికి తెరతీసింది. దీనిపైనా .. చిరంజీవి బృందం తమ అభిప్రాయాన్ని వెల్లడించే వీలుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Viral Video: కుక్కను కాపాడేందుకు పిల్లి చేసిన పోరాటం చూస్తే ఆశ్చర్యపోతారు.. నిజమైన స్నేహం ఇదేనంటూ నెటిజన్ల కామెంట్లు

Business Plan: యూట్యూబ్ చూసి లక్షలు సంపాదిస్తున్నాడు.. విజయ పథంలో దూసుకుపోతున్న జార్ఖండ్ యువకుడు

 

Click on your DTH Provider to Add TV9 Telugu