AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఐఫా ఉత్సవానికి సమంత.. ఆ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్న స్టార్ హీరోయిన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సామ్. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏమాయచేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాగా చైతన్య హీరోగా నటించాడు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా నచ్చింది. ఆతర్వాత సమంత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

Samantha: ఐఫా ఉత్సవానికి సమంత.. ఆ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్న స్టార్ హీరోయిన్
Samantha
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2024 | 1:39 PM

Share

సినిమాలకు ఏడాదిగా బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత సినిమాల కోసం ఆమె అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సామ్. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏమాయచేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాగా చైతన్య హీరోగా నటించాడు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా నచ్చింది. ఆతర్వాత సమంత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మహేష్ బాబుతో చేసిన దూకుడు సినిమా ఈ అమ్మడి కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చింది. దాంతో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంది. అలా తక్కువ సమయంలోనే సమంత స్టార్ గా మారిపోయింది.

ఇది కూడా చదవండి :  స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?

స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆతర్వాత ఈ ఇద్దరు అనూహ్యంగా విడాకులు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సామ్ ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె మాయోసైటిస్ బారిన పడటం దాని నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడం కోసం సామ్ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది.ఇక ఇప్పుడు వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.

ఇది కూడా చదవండి :Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

ఇక ఇప్పుడు సమంత ఐఫా ఉత్సవంలో పాల్గొననుంది. ఈ అవార్డుల ఉత్సవం సెప్టెంబరు 6, 7వ తేదీలలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో సామ్ ఓ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనుందని తెలుస్తోంది. ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సామ్ అవార్డు అందుకోనుంది. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో జరిగిన ఐఫా ఉత్సవం 2024లో సమంత ఈ అవార్డును అందుకుంటుందని తెలుస్తోంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సామ్ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. సమంతను ఓ పవర్‌హౌస్ అని చాలా మంది ప్రశంసించారు. అలాగే తమిళభాషలోనూ తన సత్తా చాటింది. అక్కడ కూడా సూపర్ హిట్ సినిమాల్లో స్టార్ హీరోలతో జత జాట్టింది సామ్. వీటితో పాటు బాలీవుడ్ లో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్2 అనే వెబ్ సిరీస్ లోనూ నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. నటిగానే కాదు సేవాకార్యక్రమాల్లోనూ సామ్  ముందుంటుంది. అందుకే ఆమెకు ఐఫా ఉత్సవం వేదికగా ఉమెన్ ఆఫ్ ది ఇయర్  అవార్డును అందించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..