Actress Raasi: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన రాశి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. కొన్ని హిందీ సినిమాల్లోనూ మెరిసింది. సినిమాల సంగతి పక్కన పెడితే .. నటి రాశి ప్రముఖ దర్శకుడు శ్రీ మునిని వివాహం చేసుకుంది.
ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్లలో రాశి కూడా ఒకరు. 1989 లో ‘మమతల కోవెల’ సినిమాలో బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాశి. అప్పుడామె వయసు కేవలం 9 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన ఆమె 1997 లో జగపతి బాబు ‘శుభాకాంక్షలు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గోకులంలో సీత, పెళ్లి పందిరి, సుప్రభాతం, గిల్లి కజ్జాలు, స్నేహితులు, మనసిచ్చి చూడు, కృష్ణ బాబు, సుమద్రం, ప్రేయసి రావే, అమ్మో ఒకటి తారీఖు, దేవుళ్లు, దీవించండి, త్రినేత్రం, సందడే సందడి తదితర హిట్ సినిమాల్లో కథానాయికగా నటించింది. ఇక మహేష్ బాబు నిజం సినిమాలో నెగెటివ్ రోల్ లోనూ ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ సినిమాల్లోనూ తళుక్కుమందీ అందాల తార. ఇక పెళ్లి తర్వాత పలు సినిమాల్లో అత్తగా, అమ్మగా, వదినమ్మగా సహాయక పాత్రల్లో నటించింది రాశి. ఇక గిరిజా కల్యాణం, జానకికలగనలేదు వంటి హిట సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు సైతం బాగా చేరువైందీ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీవీ సీరియల్స్,షోస్ తో బిజీగా ఉన్న నటి రాశి తాజాగా తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి రాశి దర్శించుకున్నారు.
గురువారం (అక్టోబర్ 17) ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు రాశి. ఏడుకొండల వాడకి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించారు. అలాగే ఆలయ అధికారులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో రాశిని సత్కరించారు. రాశి వెంట ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం రాశి తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. అయితే గతంలో కంటే రాశి బాగా మారిపోయారు.
తిరుమలలో కుటుంబ సభ్యులతో నటి రాశి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.