Madhu Shalini: సీక్రెట్‌గా పెళ్లిచేసుకుని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన తెలుగు హీరోయిన్‌.. వరుడు ఎవరంటే..

ఇటీవలే లేడీ సూపర్‌స్టార్‌ నయనతార తన ప్రియుడు విఘ్నేశ్‌తో కలిసి ఏడడుగులు నడవగా .. తాజాగా తెలుగు హీరోయిన్‌ మధుశాలిని (Madhu Shalini) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తమిళ హీరో గోకుల్ ఆనంద్‌తో ఆమె వివాహం..

Madhu Shalini: సీక్రెట్‌గా పెళ్లిచేసుకుని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన తెలుగు హీరోయిన్‌.. వరుడు ఎవరంటే..
Madhu Shalini Marriage
Follow us
Basha Shek

|

Updated on: Jun 18, 2022 | 8:06 AM

Madhu Shalini Marriage: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. సెలబ్రిటీలు ఒక్కొక్కరూ పెళ్లిపీటలెక్కారు. ఇటీవలే లేడీ సూపర్‌స్టార్‌ నయనతార తన ప్రియుడు విఘ్నేశ్‌తో కలిసి ఏడడుగులు నడవగా .. తాజాగా తెలుగు హీరోయిన్‌ మధుశాలిని (Madhu Shalini) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తమిళ హీరో గోకుల్ ఆనంద్‌తో ఆమె వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌ వీరి గ్రాండ్‌ వెడ్డింగ్‌కు వేదికగా మారింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మధుశాలిని- గోకుల్‌ల వెడ్డింగ్‌ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు.

యాంకర్‌ టు యాక్టర్‌.. కాగా పెళ్లి తరువాత తమ వెడ్డింగ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది మధుశాలిని.. ‘ఇప్పటివరకు మీరు మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇక నుంచి మేం ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. మీ అందరి ఆశీర్వచనాలు, ఆశీస్సులు కావాలి’ అని అందులో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ నుండి హీరోయిన్‌గా మారిన వారిలో నటి మధుశాలిని కూడా ఒకరు. ఆమె బుల్లితెరపై యాంకర్‌గా ఓ వెలుగు వెలిగి, ఆ తరువాత వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేశ్‌ కితకితలు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఆమె ఒక విచిత్రం, స్టేట్‌ రౌడీ, కింగ్‌, గోపాల గోపాల,గూఢచారి తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని తమిళ, హిందీ సినిమాల్లోనూ కనిపించింది. ఇటీవలే 9 అవర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులని పలకరించిందీ అందాల తార. ఇందులో తారకరత్న భార్యగా, క్రైమ్ రిపోర్టర్‌గా నటించి మెప్పించింది. ఇక వరుడు గోకుల్‌ విషయానికొస్తే.. అరడజను తమిళ సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌ల్లో నటించాడు. కాగా తమిళ సినిమా పంచాక్షరంలో మధు శాలిని, గోకుల్‌ జంటగా నటించారు. ఈ సినిమా టైమ్‌లోనే ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆతర్వాత ప్రేమగా, ఆపై మూడుముళ్ల బంధంగా మారిందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.