Genelia D’Souza: మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన హాసిని.. ఈసారి బిగ్‍షాట్ సీఈవోగా రాబోతుందా ?..
ఆ తర్వాత తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సత్యం, సాంబ, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, బొమ్మరిల్లు, నా ఇష్టం, ఆరెంజ్ వంటి
తెలుగు సినీ పరిశ్రమలో హ…హాసిని అనగానే ఠక్కున గుర్తొచ్తే పేరు జెనిలియా (Genelia D’Souza).. బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకుల మదిలో అల్లరి అమ్మాయిగా స్థానాన్ని ఏర్పర్చుకుంది ఈ ముద్దుగుమ్మ.. బాయ్స్ సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సత్యం, సాంబ, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, బొమ్మరిల్లు, నా ఇష్టం, ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా దూసుకుపోయింది.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన ప్రియుడు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన అనంతరం సినిమాలకు దూరంగా ఉంటుంది జెనీలియా.. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా కాలం తర్వాత జెనీలియా ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటీ కథానాయికుడిగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఆమె కీలకపాత్రలో నటిస్తోన్నట్లు తెలుస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఇందులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవోగా కనిపించనుందట.. ఈ పాత్రకు కథలో ప్రాధాన్యమున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. రాధకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలు వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా బాహుబలి ఫేమ్ లెన్స్‌మెన్ కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. జెనీలియా 2012లో చివరిసారిగా నా ఇష్టం సినిమాలో కనిపించింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..