Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 12 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పటికీ అదే అందం
సినిమా హీరోయిన్ గా బిజీ ఉండగానే ఓ బిజినెస్ మెన్ తో పెళ్లిపీటలెక్కిందీ అందాల తార. అయితే సినిమా ఛాన్సులు తగ్గిపోతాయేమోనని తన పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడీ అందాల తారకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా గుర్తింపు పొందిన అందాల తారలు ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. హీరో, హీరోయిన్లకు అత్తగా, అమ్మగా, అక్కగా నటిస్తూ మెప్పిస్తున్నారు. జెనీలియా, భూమిక, అన్షు, లయ, రంభ, మీనా, విజయశాంతి,సంగీత ఇలా చాలా మంది హీరోయిన్లు ఈ మధ్యన రీఎంట్రీ ఇచ్చి మెప్పించారు. ఇప్పుడీ జాబితాలోకి మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా చేరింది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార పెళ్లి, పిల్లల కారణంగా పరిశ్రమకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. యంగ్ హీరోతో కలిసి ఆమె నటించిన ఓ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా కే- ర్యాంప్. . జైన్స్ నాని తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ శివ బొమ్మక ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కే ర్యాంప్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజైన కే ర్యాంప్ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో సడెన్ గా ఒక సీనియర్ హీరోయిన్ కనిపించి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు రణం, బెండు అప్పారావు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కామ్న జెఠ్మలాని.
కామ్మ జెఠ్మలాని లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
2005లో ప్రేమికులు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది కామ్న జెఠ్మలాని. రణం, సామాన్యుడు, సైనికుడు, టాస్, బెండు అప్పారావు, రాజాధి రాజా, కత్తి కాంతారావు, యాక్షన్ 3డీ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2013లో చివరిగా శ్రీ జగద్గురు ఆది శంకర మూవీలో కనిపించింది. కాగా సినిమాల్లో ఉండగానే కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్‌ను వివాహం చేసుకుంది. అయితే సినిమా ఛాన్సుల కోసం చాలా కాలం పాటు ఈ విషయాన్ని దాచి పెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడీ అందాల తారకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




