Sampoornesh Babu: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోదరా అంటోన్న సంపూర్ణేష్.. మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు..
హృదయ కాలేయం సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు సంపూర్ణేష్ బాబు. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తనదైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విడుదల సమయంలో ఇతను హీరో ఏంటంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ తన ప్రతిభతో విమర్శలకు చెక్ పెట్టాడు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం సినిమాతో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్.. మొదటి సినిమాతోనే నటుడిగా తనదైన కామెడీ పంచ్ లు, నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అప్పట్లో వరుస సినిమాలతో అలరించిన సంపూ.. ఈ మధ్య మాత్రం ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేయడానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న థియేటర్స్‌ల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. ఇంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే నాలుగు పాటలకు మంచి స్పందన లభించాయి. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తోంది. తప్పకుండా మా సోదరా చిత్రం ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ” సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..