War 2: వార్ 2 చిత్రాన్ని మిస్ చేసుకున్న ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోస్.. ఎన్టీఆర్ కంటే ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా..
ఈ సినిమాతో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఈ వార్ 2 సినిమాను ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ మిస్ చేసుకున్నారట. ఎన్టీఆర్ కంటే ముందు వారిద్దరిని సంప్రదించగా.. అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశారట. ఇంతకీ వారిద్దరు ఎవరో తెలుసుకుందామా.

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీతో విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో తారక్ సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు తారక్. ఇందులో జాన్వీ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీతోపాటు.. హిందీలో వార్ 2 సినిమాలోనూ నటించనున్నారు. ఇందులో హృతిక్ రోషన్.. ఎన్టీఆర్ ప్రధానపాత్రలలో కనిపించనున్నారు. దీంతో వార్ 2 చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఈ వార్ 2 సినిమాను ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ మిస్ చేసుకున్నారట. ఎన్టీఆర్ కంటే ముందు వారిద్దరిని సంప్రదించగా.. అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశారట. ఇంతకీ వారిద్దరు ఎవరో తెలుసుకుందామా.
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ వార్ 2 సినిమా కోసం ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను అనుకున్నారట. ఇదే విషయమై ఆయనను సంప్రదించగా..ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు నో చెప్పారట. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండను అనుకున్నారట. కానీ లైగర్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తిరిగి తమ ఆలోచన మార్చుకున్నారట. చివరకు ఈ సినిమా కోసం తారక్ ను సంప్రదించారట. స్టోరీ నచ్చడంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమా కోసం తారక్‌కు రూ. 80 కోట్లకు పైగానే ఆఫర్ చేసినని సమాచారం.




ప్రస్తుతం తారక్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించే సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని పెంచేశాయి. మాస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత తారక్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.