Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. కోట్లలో ఆస్తిపాస్తులు

చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా వందలకోట్లు వెనకేసుకుంటున్నారు. సినిమాలకు కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ బాగానే సంపాదిస్తున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, కమెడియన్స్, విలన్స్ ఇలా చాలా మంది క్రేజ్ సొంతం చేసుకుంటూ చేతినిండా సంపాదిస్తున్నారు. అలాగే ఈ లేడీ కమెడియన్ కూడా..

అప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. కోట్లలో ఆస్తిపాస్తులు
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 31, 2025 | 12:08 PM

సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఎంతో మంచి అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. చెప్పులరిగే దాకా తిరిగిన కూడా అవకాశాలు వస్తాయన్న గ్రారేంటీ ఉండదు. ఒకవేళ అవకాశాలు వచ్చినా కూడా అదృష్టం కలిసి రాకపోతే కెరీర్ కష్టమే.. అయితే సినిమాల్లోకి రాక ముందు చాలా మంది నటీనటులు ఎన్నో అవస్థలు పాడారు. తినడానికి తిండిలేక, ఉండటానికి రూమ్ లేక ఎన్నో కష్టాలను చూశారు. మొత్తానికి అవకాశాలు రావడం అలాగే అదృష్టం కూడా కలిసి రావడంతో కొందరు స్టార్స్ గా మారిపోయారు. అందులో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడింది. ఇప్పుడు ఆమె ఓ స్టార్, వందల కోట్లకు యువరాణి ఆమె. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ లు, లేడీ విలన్స్, లేడీ కమెడియన్స్ కూడా  ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్స్ గా మారారు. అలాగే పైన కనిపిస్తున్న నటి ఓ స్టార్ కమెడియన్ ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వుల పూలు పూస్తాయి. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ భారతి సింగ్. ఆమె కపిల్ శర్మ షో ద్వారా పాపులర్ అయ్యింది. తన కామెడీతో, పంచ్ లతో బాగా పాపులర్ అయ్యింది. యూనిక్ కామెడీతో నవ్వించే భారతి సింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కామెడీ షోలతో పాటు పలు రియాలిటీ షోల్లోనూ ఆమె పాల్గొంటూ  నవ్వులు పూయిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టార్ గా రాణిస్తున్న భారతి సింగ్ జర్నీ అంత సులువుగా సాగలేదు. ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆ వివరాలన్నీ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపింది. భారతికి రెండేళ్ల వయసు ఉండగానే తండ్రి మరణించాడు. అప్పటి నుంచి ఆమె తల్లే కుటుంబ భారాన్ని మోసింది. తన తల్లి ఎన్నో కష్టాలు పడి తమను పెంచిందని, ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బ్లాంకెట్లు కుట్టేది, రాత్రి సమయంలో స్టిచ్చింగ్ చేసేది అని తెలిపింది. ఆ సమయంలో తినడానికి తిండి కూడా దొరికేది కాదు అని ఎండిపోయిన రొట్టెలను తినేవాళ్లం. అలా ఎన్నో రోజులు గడిపాము అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆమె ఓ స్టార్. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న లేడీ కమెడియన్స్ లో భారతి ఒకరు. ఆమె ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నికర సంపాదన దాదాపు రూ.30 కోట్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి