మీకో దండంరా సామీ..! మీ తిట్లు తట్టుకోలేక నేను అతన్ని హింస పెట్టా: నిర్మాత నాగవంశీ
విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సాలిడ్ హిట్ కోసం విజయ్ చాలా రోజులగా ఎదురుచూస్తున్నాడు. విజయ్ అర్జున్ రెడ్డిలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

బడా సినిమాలు వస్తున్నాయంటే చాలు అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్డేట్స్ ఆలస్యం అవ్వడంతో సోషల్ మీడియాలో మేకర్స్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఇప్పటికే చాలా మంది మూవీ మేకర్స్ ఈ ట్రోల్స్ బారిన పడ్డారు. ఫ్యాన్స్ ఆగ్రహంతో రెచ్చిపోయి మరి సోషల్ మీడియాలో నిర్మాతలని తిడుతూ ఉంటారు. మొన్నీమధ్య రామ్ చరణ్ అభిమాని గేమ్ చెంజర్ అప్డేట్ ఇవ్వకపోతే చచ్చిపోతాను అంటూ సూసైడ్ లెటర్ కూడా రాసి హడావిడి చేశాడు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నిర్మాత నాగవంశీ మీద పడ్డారు. సోషల్ మీడియా వేదికగా నాగవంశీని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. దీని పై తాజాగా నాగవంశీ స్పందించారు. అసలు విషయం ఏంటంటే..
నాగవంశీ నిర్మాతగా విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ నటించిన సినిమాలు వరుసగా అభిమానులను నిరాశపరిస్థున్నాయి. లైగర్ దగ్గర నుంచి ఖుషీ, ఫ్యామిలీ స్టార్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. దాంతో ఇప్పుడు విజయ్ 12వ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దాంతో ఈ సినిమా అప్డేట్స్ రాకపోవడంతో నిర్మాతలపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిర్మాత నాగవంశీని టార్చర్ చేస్తున్నారు. దాంతో ఆయన తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మీ తిట్ల దండకం దెబ్బకు నేను గౌతమ్ ను హింస పెట్టి టైటిల్ ను లాక్ చేశా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగవంశీ. త్వరలోనే విజయ్ కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తాం అని తెలిపారు. మరి ఇప్పటికైనా విజయ్ అభిమానులు శాంతిస్తారేమో చూడాలి. గౌతమ్ తిన్ననూరి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆకట్టుకునే కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తుంటాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఇప్పుడు విజయ్ తోనూ అలాంటి స్టోరీనే తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా పై అభిమానులతో పాటు చిత్రయూనిట్ కూడా ధీమాతో ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
Mee andari abuses tarvathaa nenu Gowtam ni chala himsa pettaka 😝😝 Finally we’ve locked the title!! 🤓#VD12 title will be out very soon!!
Watchout this space 🤩🤩
— Naga Vamsi (@vamsi84) January 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి