- Telugu News Photo Gallery Cinema photos Do you know who is this actress who was once a heroine and is now acting as a villain, She is Sriya Reddy
అప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ లేడీ విలన్.. ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా..?
విలన్ గానే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే పాన్ ఇండియా హిట్ సాధించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? హీరోయిన్స్ కు మించిన క్రేజ్ ఉన్న ఆ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
Updated on: Jan 30, 2025 | 2:07 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్స్ గా చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. లేడీ విలన్ గా నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను కవ్వించింది ఈ అమ్మడు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

విలన్ గానే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే పాన్ ఇండియా హిట్ సాధించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? హీరోయిన్స్ కు మించిన క్రేజ్ ఉన్న ఆ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో కాదు అందాల భామ శ్రియ రెడ్డి. తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా .. శ్రియ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అందంతోనూ ఆకట్టుకుంది

శ్రియ రెడ్డి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. తెలుగులో అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది.

ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో మెప్పించింది శ్రియ రెడ్డి. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ.




