AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Movies: సమ్మర్ ఎంటర్‏టైన్మెంట్ పక్కా.. మార్చిలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

వేసవి కాలం ప్రారంభమయ్యింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు చిన్నారులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అటు థియేటర్లలో సినీప్రియులను అలరించేందుకు పలు చిత్రాలు రెడీ అవుతున్నాయి. మార్చి ఫస్ట్ వీక్ రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసా.. ?

Tollywood Movies: సమ్మర్ ఎంటర్‏టైన్మెంట్ పక్కా.. మార్చిలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Chhaava, Mad 2
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2025 | 4:22 PM

Share

మార్చి నెల వచ్చేసింది. అంటే వేసవి కాలం సైతం ప్రారంభమయ్యింది. ఈ ఎండాకాలంలో వినోదాలు పంచేందుకు అనేక సినిమాలు రెడీ అయ్యాయి. స్టార్ హీరోల సినిమాలతోపాటు డబ్బింగ్ చిత్రాలు, చిన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నాయి. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రాలను మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అటు రీరిలీజ్ ట్రెండ్.. ఇటు కొత్త సినిమాలు ఈసారి సినీప్రియులను అన్ లిమిటెడ్ గా ఎంటర్టైన్ చేయనున్నాయి. మరీ మార్చిలో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

తెలుగులో ఛావా.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ఛావా. హిందీలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగు అడియన్స్ ముందుకు తీసుకురానున్నాయి. మార్చి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిల్ రూబా.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత అతడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ దిల్ రూబా. ఇందులో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుండగా.. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మార్చి 14న రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

కోర్ట్.. డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తోన్న లేటేస్ట్ మూవీ కోర్ట్. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించే కథాంశంతో వస్తున్న ఈ సినిమాను నాని సమర్పిస్తున్నారు. ప్రియదర్శి, హర్ష్ రోషన్ ప్రదాన పాత్రలు పోషించిన ఈ సినిమాను మార్చి 14న రిలీజ్ చేయనున్నారు.

నారి.. సీనియర్ హీరోయిన్ ఆమని, వికాస్ వశిష్ట, ప్రగతి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా నారి. మహిళా సాధికారతను చాటి చెప్పే ఈ చిత్రాన్ని మార్చి 7న విడుదల చేయనున్నారు.

మ్యాడ్ స్వేర్.. మరోసారి థియేటర్లలో సత్తా చాటేందుకు వస్తుంది మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అప్పట్లో మ్యాడ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయనున్నారు.

హరిహర వీరమల్లు.. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన కొల్లగొట్టినాదిరో సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

రాబిన్ హుడ్.. యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

డబ్బింగ్ సినిమాలు.. హారర్ థ్రిల్లర్ కింగ్ స్టన్.. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయనున్నారు. అలాగే మలయాళీ సూపర్ హిట్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సైతం రిలీజ్ చేయనున్నారు. వీర ధీర శూరన్ 2 మార్చి 27, ఎల్ 2 సినిమాలను సైతం రిలీజ్ చేయనున్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..