AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith: ఆ ఒక్క విషయం లో తగ్గేదేలే అంటున్న అజిత్.. వణికిపోతున్న ఫ్యాన్స్

చంపితే చంపేయండ్రా ఇలా టెన్షన్ పెట్టొద్దంటూ బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ చెప్తాడు కదా..! ఇప్పుడు అజిత్‌ను చూసి ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారు. ఊరికే అలా కంగారు పెట్టొద్దు సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్లు. మరి అభిమానులను అంతగా అజిత్ ఏం కంగారు పెడుతున్నారు..? అసలేం చేస్తున్నారాయన..?

Phani CH
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 01, 2025 | 8:19 PM

Share
ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టడం తప్ప మరో పనేదీ పెట్టుకోలేదు తమిళ హీరో అజిత్. ఈయన చేస్తున్న పనులు చూస్తుంటే అభిమానులకు గుండెలు జారిపోతున్నాయి. సినిమాలు చేయండి హీరోగారూ అంటే కాదు నేను వెళ్లి రేసింగ్ చేస్తానంటున్నారు.

1 / 5
సర్లే ప్యాషన్ కదా అని సర్దుకున్నారు ఫ్యాన్స్. కాన అక్కడ పదే పదే ప్రమాదాల బారిన పడుతున్నారు అజిత్. అజిత్‌కు రేసింగ్ అంటే ప్రాణం. సినిమాలు చేస్తూనే.. రేసులకు వెళ్తుంటారీయన.

2 / 5
ఇప్పుడేకంగా కెరీర్‌కు బ్రేకిచ్చి మరీ.. రేసింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన రేసులో అజిత్ కార్‌కి ప్రమాదం జరిగింది. అజిత్ కారులోని కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూసి వణికిపోతున్నారు ఫ్యాన్స్.

3 / 5
కాకపోతే ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు ఈ హీరో. గత రెండు నెలల్లో అజిత్ కార్ ప్రమాదానికి గురి కావడం ఇది రెండోసారి. జనవరిలో దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ ప్రాక్టీస్‌లో భాగంగానూ అజిత్ కార్‌కు యాక్సిడెంట్ అయింది.

4 / 5
ప్రమాదం నుంచి బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్.. ఇప్పుడు మళ్లీ ప్రమాదానికి గురయ్యారు అజిత్. ఈ రేసింగ్‌లు ఏమో గానీ అభిమానులకు అయితే రోజూ టెన్షన్ తప్పట్లేదు.

5 / 5