AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈవారం థియేటర్స్/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. టిల్లు, లిల్లి అల్లరికి మణికందన్ ప్రేమకథ..

అటు ఓటీటీల్లోనూ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్.. హారర్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంటాయి. ఇక వేసవి వచ్చేసింది.. దీంతో ఈ సమ్మర్‏లో మూవీ లవర్స్‏ను కూల్ చేయడానికి ఈ వారం లేటేస్ట్ కామెడీ రొమాంటిక్ చిత్రాలు.. లవ్ స్టోరీస్.. అడ్వైంచర్ మూవీస్ రిలీజ్ కాబోతున్నారు. మరీ మార్చి నాలుగో వారంలో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

Tollywood: ఈవారం థియేటర్స్/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. టిల్లు, లిల్లి అల్లరికి మణికందన్ ప్రేమకథ..
Tollywood Movies
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2024 | 10:54 AM

Share

ప్రతి శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనున్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద సినిమాలు అడియన్స్ ముందుకు వస్తాయి. అటు ఓటీటీల్లోనూ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్.. హారర్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంటాయి. ఇక వేసవి వచ్చేసింది.. దీంతో ఈ సమ్మర్‏లో మూవీ లవర్స్‏ను కూల్ చేయడానికి ఈ వారం లేటేస్ట్ కామెడీ రొమాంటిక్ చిత్రాలు.. లవ్ స్టోరీస్.. అడ్వైంచర్ మూవీస్ రిలీజ్ కాబోతున్నారు. మరీ మార్చి నాలుగో వారంలో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

టిల్లు స్వ్కేర్..

డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సిద్దు జొన్నలగడ్డ. ఇందులో నేహా శెట్టి కథానాయికగా నటించింది. ఇక ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా రూపొందించిన సినిమా ఇది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం ఇప్పటికే అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మార్చి 29న రిలీజ్ కానుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

ఆడు జీవితం..

విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ది గోట్ లైఫ్. ఈ సినిమాను తెలుగులో ఆడు జీవితం పేరుతో రిలీజ్ చేయనున్నారు. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమలా పాల్ నటించింది. గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. దాదాపు పదేళ్లుగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా కోసం ఏకంగా 31 కిలోల బరువు తగ్గారు పృథ్వీరాజ్. కేరళ నుంచి పని కోసం సౌదీ వెళ్లి ఓ యువకుడు బానిసత్వాన్ని భరించలేక ఏడారి గుండా స్వదేశానికి పయనమవుతాడు. ఆ దారిలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటీ ? అనే అంశాలను ఈ మూవీలో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేయనున్నారు.

అలాగే హాలీవుడ్ మూవీ లవర్స్ కు ఇష్టమైన చిత్రాలు కూడా రాబోతున్నాయి. అటు గాడ్జిల్లా, ఇటు కింగ్ కాంగ్ ఒకదానిపై విరుచుకుపడే విజువల్ ట్రీట్ అందించేందుకు వార్నర్ బ్రదర్స్ రూపొందించిన సినిమా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్.. ఈ మూవీని మార్చి 29న ఇంగ్లీష్ తోపాటు భారతీయ అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు.. ఆహా..

సుందరం మాస్టర్… తెలుగు మూవీ.. ఆహా.. మార్చి 28..

ఈటీవీ విన్..

ఏం చేస్తున్నావ్.. తెలుగు సినిమా.. మార్చి 28

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

ట్రూ లవర్.. తెలుగు డబ్ మూవీ.. మార్చి 27 పట్నా శుక్లా.. హిందీ.. మార్చి 29 రెనెగడె నెల్ల్.. వెబ్ సిరీస్.. మార్చి 29

అమెజాన్ ప్రైమ్..

టిగ్ నొటారో.. వెబ్ సిరీస్.. మార్చి 26 ది బాక్స్ టర్స్.. వెబ్ సిరీస్.. మార్చి 28

నెట్ ఫ్లిక్స్..

టెస్టామెంట్.. వెబ్ సిరీస్.. మార్చి 27 హార్ట్ ఆఫ్ ది హంటర్.. హాలీవుడ్.. మార్చి 29 ది బ్యూటిఫుల్ గేమ్.. హాలీవుడ్.. మార్చి 29 ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో.. హిందీ.. మార్చి 30

బుక్ మై షో..

ది హోల్డోవర్స్.. హాలీవుడ్.. మార్చి 29

జియో సినిమా..

ఎ జెంటిల్ మ్యాన్ ఇన్ మాస్క్.. వెబ్ సిరీస్.. మార్చి 29

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..