AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barrelakka: కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క.. పెళ్లి తేదీ ఎప్పుడంటే..

బర్రెలక్క అసలు పేరు కర్నె శీరిష. తెలంగాణంలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన ఆమె.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసింది. తన ఇన్ స్టాలో నిశ్చితార్థం వీడియో షేర్ చేసి పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సడెన్ గా పెట్టుకోవడం వల్ల అందరిని పిలవలేకపోయానని చెప్పుకొచ్చింది. దీంతో బర్రెలక్క పెళ్లి ఎప్పుడు ?.. ఆమెకు కాబోయే భర్త ఎవరు ? అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే తనకు కాబోయే భర్తను ఇన్నాళ్లు చెప్పకుండానే సైలెంట్ గా ఉండిపోయింది.

Barrelakka: కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క.. పెళ్లి తేదీ ఎప్పుడంటే..
Barrelakka
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2024 | 10:24 AM

Share

బర్రెలక్క.. సోషల్ మీడియాలో ఈ పేరు పెద్ద సెన్సెషన్. డిగ్రీ చదివినా ఉద్యోగాలు వస్తాలేవు.. అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో నెట్టింట ఆమె షేర్ చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆమెకు యువత, స్టార్స్, ప్రముఖులు సపోర్ట్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఓట్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఎలక్షన్స్ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన బర్రెలక్క పేరు ఇప్పుడు మరోసారి నెట్టింట మారుమోగుతుంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలలెక్కనుంది. బర్రెలక్క అసలు పేరు కర్నె శీరిష. తెలంగాణంలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన ఆమె.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసింది. తన ఇన్ స్టాలో నిశ్చితార్థం వీడియో షేర్ చేసి పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సడెన్ గా పెట్టుకోవడం వల్ల అందరిని పిలవలేకపోయానని చెప్పుకొచ్చింది. దీంతో బర్రెలక్క పెళ్లి ఎప్పుడు ?.. ఆమెకు కాబోయే భర్త ఎవరు ? అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే తనకు కాబోయే భర్తను ఇన్నాళ్లు చెప్పకుండానే సైలెంట్ గా ఉండిపోయింది.

కానీ ఇప్పుడు పెళ్లి తేదీతోపాటు.. కాబోయే భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది. అలాగే పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ తన భర్త ఇన్ స్టా ఐడికి ట్యాగ్ చేసింది. బర్రెలక్కకు కాబోయే భర్త పేరు వెంకటేశ్.. అతడి ఇన్ స్టా ఐడిలో ఎంఎస్సీ ఫిజిక్స్ మినహా.. మరే వివరాలు కనిపించలేదు. ప్రస్తుతం బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్.

బర్రెలక్క తల్లి రోజూ కూలీ. ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీకి సాయంగా ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది కర్నె శీరిష. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు