Upcoming Movies: బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే.. జూన్‏లో దుమ్మురేపడానికి సిద్ధమైన పాన్ ఇండియా చిత్రాలు..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: May 18, 2022 | 9:04 AM

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సినిమా అంటే సుందరానికీ.. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా

Upcoming Movies: బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే.. జూన్‏లో దుమ్మురేపడానికి సిద్ధమైన పాన్ ఇండియా చిత్రాలు..
Pan Indian Films

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు సౌత్ సినిమాలు రచ్చ చేస్తున్నాయి.. వరుస పాన్ ఇండియా చిత్రాలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. అంచనాలకు మించి వసూళ్లలను సాధిస్తూ ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తున్నాయి.. ఇప్పటికే పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో దక్షిణాది చిత్రపరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు అడ్రస్‏గా మారాయి. ఇప్పటికే ఈ చిత్రాలు కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించాయి. మార్చి.. ఏప్రిల్, మే సినీ ప్రియులకు లెక్కలేనంత ఎంటర్‏టైన్మెంట్‏ను అందించాయి. ఇక ఇప్పుడు జూన్ నెలలో మరోసారి బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి దక్షిణాది చిత్రాలు.. వచ్చే నెలలో మరిన్ని పాన్ ఇండియా చిత్రాల హావా ఉండబోతుంది.

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సినిమా అంటే సుందరానికీ.. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిలం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అవిడి శేష్ ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న సినిమా మేజర్. 26/11 ముంబై ఉగ్రవద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 3న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి శిశి కిరమ్ తిక్కా దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తో్న్న లేటేస్ట్ చిత్రం విక్రమ్. మాస్టర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లోకేషన్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూర్య, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి పాపులర్ స్టార్స్ కీలకపాత్రలలో నటిస్తుననారు. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో జూన్ 3న విడుదల చేయనున్నారు.

కిరిక్ పార్టీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం 777 చార్లీ. ఈ చిత్రానికి కిరణ్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగుతోపాటు… కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయబోతున్నారు… మొత్తానికి వచ్చే నెలలో ఈ నాలుగు పాన్ ఇండియా చిత్రాలు రోజుల వ్యవధిలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu