Viral Photo: క్యూట్ స్మైల్‏తో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లో అందాల తార..

అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ హీరోయిన్‏కు దూసుకుపోయింది.

Viral Photo: క్యూట్ స్మైల్‏తో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లో అందాల తార..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: May 18, 2022 | 8:18 AM

పైన ఫోటోలో క్యూట్ క్యూట్ చిరునవ్వుతో.. అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఏర్పర్చుకుంది ఈ అమ్మడు.. అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ హీరోయిన్‏కు దూసుకుపోయింది. గ్లామర్ పాత్రలే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పించింది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చిన్న వయసులో వెండితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా క్రేజ్ ఉంది.. ఎవరో గుర్తుపట్టండి..

ఈ చిన్నారి మరెవరో కాదండోయ్.. హీరోయిన్ ఛార్మి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిర్మాతగానూ రాణిస్తోంది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ పై విజయ్ దేవరకొండతో కలసి లైగర్, జనగనమణ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో లైగర్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)