షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్‌ హీరో.. దెబ్బలతోనే యాక్షన్‌ సీన్స్‌ పూర్తి.. ఫ్యాన్స్‌ ప్రశంసలు..

Sidharth Malhotra: షూటింగ్ సందర్భంగా సిద్ధార్థ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా అభిమానులకు తెలిపాడు. తన మోచేతి నుంచి రక్తం వస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్‌ హీరో.. దెబ్బలతోనే యాక్షన్‌ సీన్స్‌ పూర్తి.. ఫ్యాన్స్‌ ప్రశంసలు..
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: May 17, 2022 | 10:09 PM

Sidharth Malhotra: గతేడాది షేర్షా సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ అందుకున్నాడు బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా (Sidharth Malhotra). త్వరలోనే ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ (Indian Police Force) అనే సినిమాతో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టనున్నాడు. బాలీవుడ్‌లో యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే రోహిత్‌ శెట్టి (Rohith Shetty) ఈ సినిమాను తెరకెక్కి్స్తున్నాడు.కాగా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు సిద్ధార్థ్. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ సందర్భంగా సిద్ధార్థ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా అభిమానులకు తెలిపాడు. తన మోచేతి నుంచి రక్తం వస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే దెబ్బలతోనే మిగతా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేశాడట సిద్ధార్థ్.

కాగా ఈ వీడియోల్లో యాక్షన్‌ సీన్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను మనం చూడవచ్చు. ఇందులో ప్రత్యర్థితో ఫైట్ చేస్తూ  కనిపించాడుసిద్దార్థ్‌. ఈ ఫైటింగ్‌షూట్‌లోనే హీరో చేతికి గాయాలయ్యాయి. ఈ ఫొటోలు, వీడియోలను అతను అభిమానులతో పంచుకోగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. దెబ్బలు తగిలినా యాక్షన్‌ సీన్స్‌ను పూర్తిచేయడంపై ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ సినిమాలో సిద్ధార్థ్‌తో పాటు వివేక్‌ ఓబెరాయ్‌, శిల్పాశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Karate Kalyani: కావాలనే కొందరు నాపై కుట్ర పన్నుతున్నారు.. నన్ను బద్నాం చేసేందుకే ఈ వివాదాలు: కరాటే కల్యాణి

Tirupati: గంగమ్మ జాతరలో కత్తి పట్టిన సీఐ.. స్థానికులతో కలిసి చిందులు.. వైరలవుతోన్న వీడియో..

జీడితోటలో కలకలం.. అక్కడి సీన్‌ చూసి భయంతో కూలీలు పరుగులు..