Nikamma: న్యాచురల్‌ స్టార్‌ పాత్రకు న్యాయం చేసేనా? ఆకట్టుకుంటోన్న శిల్పాశెట్టి నికమ్మ ట్రైలర్‌..

Nikamma Trailer: నికమ్మ ట్రైలర్‌ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. హీరో అభిమన్యు అదరగొట్టినా నాని క్యారెక్టర్‌కు న్యాయం చేస్తాడా?లేదా?అనేది సిల్వర్‌ స్ర్కీన్‌పై చూస్తే గానీ తెలియదు.

Nikamma: న్యాచురల్‌ స్టార్‌ పాత్రకు న్యాయం చేసేనా? ఆకట్టుకుంటోన్న శిల్పాశెట్టి నికమ్మ ట్రైలర్‌..
Nikamma
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: May 17, 2022 | 10:09 PM

Nikamma Trailer: న్యాచురల్‌ స్టార్‌ నాని, సాయిపల్లవి జంటగా 2017లో విడుదలైన చిత్రం MCA (మిడిల్‌ క్లాస్ అబ్బాయి). వేణూ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి వదిన పాత్రలో సీనియర్‌ నటి భూమికాచావ్లా కనిపించింది. కాగా ఇప్పుడిదే సినిమాను నికమ్మ (Nikamma) పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. నాని పాత్రలో భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు దస్సానీ నటిస్తున్నాడు. హీరోయిన్‌గా షిర్లే శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. భూమిక పాత్రలో ప్రముఖ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) కనిపించనుంది. సాబిర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోని పిక్చర్స్‌ ఇండియా తెరకెక్కించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

సూపర్‌ ఉమన్‌గా శిల్ప..

కాగా నికమ్మ ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్‌ చేశారు మూవీ మేకర్స్‌. సరదాగా తిరిగే హీరోతో వదిన (శిల్పాశెట్టి) ఇంటి పనులన్నీ చేయించడంతో ఆమెను సరిగా అర్థం చేసుకోలేక హీరో కోపం పెంచుకుంటాడు. తన నుంచి దూరంగా వెళ్లిపోవాలని భావిస్తాడు. అయితే అసలు విషయం తెలిసే సరికి ఓ పెద్ద సమస్యలో ఇరుక్కుంటుంది శిల్ప. ఈక్రమంలో విలన్ల బారి నుంచి తన వదినను, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేదే నికమ్మ కథ. ట్రైలర్‌ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. హీరో అభిమన్యు అదరగొట్టినా నాని క్యారెక్టర్‌కు న్యాయం చేస్తాడా?లేదా?అనేది సిల్వర్‌ స్ర్కీన్‌పై చూస్తే గానీ తెలియదు. ఇక ఎప్పటిలాగే శిల్పాశెట్టి తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలో సూపర్‌ ఉమన్‌, అమ్మవారి రూపాల్లో కనిపించి మెస్మరైజ్‌ చేసిందీ అందాల తార. కాగా కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించిన శిల్ప మరీ రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ట్రైలర్‌ను కూడా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. ఇందులోని సూపర్‌ ఉమన్‌ ఫొటోనే డీపీగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Don OTT: అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టనున్న డాన్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

Road Accident: గంగా నదిలో అస్తికలు కలిపి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

TS Inter Exams 2022: ఇటు తెలంగాణలో ఇంటర్‌ మూల్యాంకన పారితోషికం పెంపు.. అటు ఏపీలో ఉపాధ్యాయుల భారీ నిరసనలు..