Karate Kalyani: కావాలనే కొందరు నాపై కుట్ర పన్నుతున్నారు.. నన్ను బద్నాం చేసేందుకే ఈ వివాదాలు: కరాటే కల్యాణి
Karate Kalyani: విచారణ అనంతరంకల్యాణి మీడియాతో మాట్లాడారు. పిల్లలను డబ్బులకు అమ్ముకుంటున్నట్టు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిచారామె.
Karate Kalyani: అక్రమంగా పాపను దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైంది. కల్యాణీతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా పాప దత్తత గురించి కల్యాణి అధికారులకు వివరణ ఇచ్చింది. కాగా పాపను ఇల్లీగల్‌గా దత్తత తీసుకున్నట్టు తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కరాటే కల్యాణి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన వివరాలను కూడా CWC అధికారులు సేకరించారు. కాగా విచారణ అనంతరంకల్యాణి మీడియాతో మాట్లాడారు. పిల్లలను డబ్బులకు అమ్ముకుంటున్నట్టు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిచారామె. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి నిందలు వేయడం బాధ కలిగించిందన్నారు.
కలెక్టర్ తో అదే చెప్పాం..
‘ఆర్థికంగా చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉన్నాను. నాపై బురద జల్లేందుకే కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నన్ను బద్నాం చేసేందుకే చిన్నారి విషయాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు. పాపకు సంబంధించి ఇంత వరకూ ఎలాంటి దత్తత జరగలేదు. ఇదే విషయాన్ని కలెక్టర్ ముందు కూడా చెప్పాం’ అని మీడియాతో చెప్పుకొచ్చింది కల్యాణి. కాగా బిగ్‌బాస్‌తో గుర్తింపుతెచ్చుకున్న కరాటే కల్యాణి వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో వివాదం, ఆ తర్వాత చిన్నారి దత్తత విషయం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచుకుందని ఫిర్యాదు రావడంతో ఛైల్డ్ లైన్ అధికారులు కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నోటీసులకు స్పందిచకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది జరిగిన తర్వాత కల్యాణి అఙ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అయితే నిన్న మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి తాను పారిపోయే దాన్ని కాదని, పరిగెత్తించే దాన్నంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: