Sukumar: చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సుకుమార్.. శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో ఎమోషనల్..

వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు.

Sukumar: చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సుకుమార్.. శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో ఎమోషనల్..
Sukumar
Follow us

|

Updated on: May 18, 2022 | 6:52 AM

సీనియర్ హీరో రాజశేఖర్ (Rajashekar) ప్రధాన పాత్రలో జీవిత దర్శకత్వం వహిస్తున్న చిత్రం శేఖర్ (Shekar). వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్‏లో 91వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో ఆయన కూతురు శివాని కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మే17 శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను నిర్వహించారు. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు..

“తలంబ్రాలు, ఆహుతి, అంకుశం చిత్రాలు చూసి రాజశేఖర్ గారికి వీరాభిమానిని అయ్యాను.. మా ఊర్లో ఉన్న స్నేహితుడు హీరోలందరినీ ఇమిటేట్ చేసేవాడు.. నాకు వాడిని చూస్తే జెలసీ వచ్చేది. నేను అప్పుడు రాజశేఖర్ లా ఇమిటేట్ చేసేవాడిని. దాంతో నేను ఊర్లో చాలా ఫేమస్ అయ్యాను. అందరు రాజశేఖర్ లా చేయ్యు అనేవారు.. సినిమాతో అనుబంధం ఏర్పడటానికి.. నాలోనూ నటుడున్నాడని తెలియడానికి. ఇండస్ట్రీకి రావడానికి రాజశేఖర్ కారణమయ్యారు.. ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు.. ఎందుకంటే సందర్భం రాలేదు.. మనం ఫ్యామిలీని దూరం పెడతాం కానీ.. వీళ్లు వాళ్ల కూతుర్లను తీసుకువచ్చి.. ఇది పవిత్రమైన ఇండస్ట్రీని అని చెప్పకనే చెప్పారు.. జీవితా గారు చేసిన ఒక్క ఫోన్ కాల్‏తో ఇక్కడకు వచ్చాను.. ఆమె కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి.. రాజజోగయ్య గారు రాసిన పాట విన్నాను.. అందులోని శిధిలాలన్నీ కూల్చనా.. శిల్పంగా మార్చనా అంటూ సాంగే ఒక్క లైన్ విని షాకయ్యాను.. సినీ పరిశ్రమలో ఉన్నందుకు గర్వంగా ఉంది ” అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.