Teaser Talk: వాళ్లు బతికేది కేవలం 12 గంటలు మాత్రమే.. ఆసక్తి రేకెత్తిస్తోన్న నయనతార ‘ఓ2’ ట్రైలర్..
Nayanatara O2 Teaser: లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పెట్టింది పేరు నయనతార. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తోంది...
Nayanatara O2 Teaser: లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పెట్టింది పేరు నయనతార. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తోంది. ఈ క్రమంలో వచ్చినవే అనామిక, కర్తవ్వం. ఈ సినిమాల్లో నయనతార తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకులకు ముందుకు వస్తోందీ ముద్దుగుమ్మ. జీఎస్ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘ఓ2’ అనే చిత్రంలో నయనతార నటిస్తోంది.
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు. సినిమా టైటిల్‌కు తగ్గట్లుగానే టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నయనతారతో పాటు కొందరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బస్సు ఓ లోయలో పడిపోతుంది. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. లోయలో ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో బస్సులో ఉన్న వారంతా కేవలం 12 గంటలు మాత్రమే బతుకుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బస్సులో ఉన్న వారి మధ్య ఎలాంటి గొడవలు చోటుచేసుకుంటాయి.
ఇంతకీ వారంతా బస్సులో నుంచి ఎలా బయటపడ్డారన్న విభిన్న కథాంశంతో సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక నయనతార ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన నట విశ్వరూపాన్ని చూపించింది. అద్భుత నటనతో మెస్మరైజ్ చేసింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు హైలట్‌గా నిలిచిందని చెప్పాలి. ఇక ‘ఓ2’ చిత్రాన్ని నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. మరి సినిమాపై అంచనాలను పెంచేసిన టీజర్‌పై మీరూ చూసేయండి..