Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్.. పాన్ ఇండియా చిత్రానికి అసలైన అర్థం చెబుతూ..
Prashanth Neel: కేజీఎఫ్ అనే ఒకే ఒక సినిమాతో యావత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, దానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్2 చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ ముందు..
Prashanth Neel: కేజీఎఫ్ అనే ఒకే ఒక సినిమాతో యావత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, దానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్2 చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ ముందు అనూహ్య విజయాలను నమోదు చేసుకున్నాయి. దీంతో ప్రశాంత్ నీల్ క్రేజ్ మొత్తం దేశమంతా వ్యాపించింది. దీంతో ప్రశాంత్ తర్వాతి చిత్రాలపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడీ దర్శకుడు. ఇందులో భాగంగానే తర్వాతి చిత్రం సలార్‌ను ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ప్రశాంత్ ఎన్టీఆర్ హీరోగా కూడా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించనుందన్న వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరోయిన్ బాలీవుడ్, హీరో టాలీవుడ్ అలాగే మరో కీలక పాత్ర కోసం తమిళ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పాత్ర కోసం ఏకంగా కమల్ హాసన్‌ను ఒప్పించేందుకు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఆ చిత్రం పూర్తికాగానే ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..