KGF Chapter 2: మరో రికార్డ్ సృష్టించిన కేజీఎఫ్ 2.. విడుదలై 33 రోజులు గడిచినా తగ్గని యశ్ మేనియా..
యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది.
రాకింగ్ స్టార్ యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.. యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ఆర్ఆర్ఆర్.. దంగల్ సినిమా రికార్డ్లను క్రాస్ చేసిన కేజీఎఫ్ 2 ఇప్పుడు మరో రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీంతో దంగల్, బాహుబలి ది కన్క్లూజన్ తర్వాత అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్ 2 నిలిచింది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్, బీస్ట్ చిత్రాల పోటీని తట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నెల రోజులు గడిచిపోయినప్పటికీ కేజీఎఫ్ 2 హావా మాత్రం తగ్గడం లేదు.
తాజాగా ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 సినిమా రూ. 1200 కోట్లు క్రాస్ చేసిందని ట్రెడ్ అనలిస్ట్ మనోబాల విజయ్ బాలన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 1వ వారం – రూ. 720.31 కోట్లు. 2వ వారం – రూ. 223.51 కోట్లు. 3వ వారం – రూ. 140.55 కోట్లు. 4వ వారం – రూ. 91.26 కోట్లు. 1వ వారం – రూ. 5 రోజు 5.20 కోట్లు. 2వ రోజు – రూ. 4.34 కోట్లు. 3వ రోజు – రూ. 6.07 కోట్లు. 4వ రోజు – రూ. 9.52 కోట్లు. మొత్తం – రూ. 1200.76 కోట్లు
#KGFChapter2 WW Box Office
ENTERS ₹1200 cr club.
Week 1 – ₹ 720.31 cr Week 2 – ₹ 223.51 cr Week 3 – ₹ 140.55 cr Week 4 – ₹ 91.26 cr Week 5 Day 1 – ₹ 5.20 cr Day 2 – ₹ 4.34 cr Day 3 – ₹ 6.07 cr Day 4 – ₹ 9.52 cr Total – ₹ 1200.76 cr
— Manobala Vijayabalan (@ManobalaV) May 16, 2022
₹1200 cr+ club films#Dangal#Baahubali2#KGF2
— Manobala Vijayabalan (@ManobalaV) May 16, 2022