Vijay Thalapathy: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న వరిసు సెకండ్ సింగిల్.. నెట్టింట్లో విజయ్ మేనియా..
ఇక తాజాగా విడుదలైన #TheeThalapathy సాంగ్ సైతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. విడుదలైన 24 గంటల్లోనూ మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
తమిళ్ స్టార్ హీరో విజయ్ నేరుగా తెలుగులో నటిస్తో్న్న చిత్రం వారుసుడు. ఇదే సినిమాను తమిళంలో వరిసు టైటిల్ తో విడుదల చేయనున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన రంజితమే పాటకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో విజయ్, రష్మిక ల కెమిస్ట్రీ, కాస్ట్యుమ్స్, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇక తాజాగా విడుదలైన #TheeThalapathy సాంగ్ సైతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. విడుదలైన 24 గంటల్లోనూ మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
ఈ సాంగ్ కు ముందు నుంచి ఇచ్చిన హైప్ కి తగ్గట్టే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సాలిడ్ ట్యూన్ అండ్ బీట్ ని అందించాడు. సాంగ్ లో విజువల్స్ కూడా మంచి ఫైరింగ్ లో విజయ్ కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ గా కనిపిస్తుండగా ఈ అంతటికీ మాత్రం థమన్ తన మ్యూజిక్ తో డెఫినెట్ గా విజయ్ ఫ్యాన్స్ కి అదిరే ట్రీట్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ పాటకు 5 మిలియన్ కు పైగా రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి.
ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త నటిస్తుండగా… అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
5M+ real time views for #TheeThalapathy!! Pera ketaley whistle dhan ?
?️ @SilambarasanTR_ sir ? @MusicThaman ?️ @Lyricist_Vivek#Thalapathy @actorvijay sir @directorvamshi @SVC_official @iamRashmika @AlwaysJani @dop_gkvishnu @iamSandy_Off pic.twitter.com/TEOA8g3beQ
— Sri Venkateswara Creations (@SVC_official) December 4, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.