Megastar Chiranjeevi: బాసూ.. ఫోటో అదిరిపోయింది.. నౌకదళ ఆఫీసర్గా మెగాస్టార్ చిరంజీవి.. ఈ పిక్ చూశారా ?
గోవాలోని ఎయిర్ పోర్టులో ఇండియన్ నేవీ ఆఫీసర్లను కలుసుకున్నారు. వారితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. గతంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు నేవీ దుస్తుల్లో ఉన్న ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.
వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి హజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గోవాలోని ఎయిర్ పోర్టులో ఇండియన్ నేవీ ఆఫీసర్లను కలుసుకున్నారు. వారితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. గతంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు నేవీ దుస్తుల్లో ఉన్న ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. “గత వారం నేను గోవాకి వెళ్లినప్పుడు కొంతమంది నేవీ ఆఫీసర్స్ నా దగ్గరికి వచ్చి పోటో దిగారు. అప్పుడు నా పాతకాలం నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నేను ఎన్ఎస్ సీ లో జాయిన్ అయినప్పుడు నేవీ క్యాడెట్ లో సేవలు అందించాను. హ్యాపీ నేవీ డే” అంటూ ట్వీట్ చేశారు. చిరు షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. నేవీ డ్రెస్లో మెగాస్టార్ ఫోటో చూసిన అభిమానులు షాకవుతున్నారు. చిరు ఎన్ఎస్ సీ కి కూడా పని చేశారా అని ఆశ్చర్యపోతున్నారు. బాస్.. మీరు మాకు స్పూర్తి.. ఫోటో అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వేడుకలలో మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాలుగా నటుడిగా 150 కి పైగా చిత్రాల్లో నటించి వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారని.. ఆయనది ప్రత్యేకమైన కెరీర్ అంటూ చిరుపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు చేస్తున్నారు. ఇందులో వాల్తేరు వీరయ్య.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మా హారాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు.
When a bunch of Naval officers approached me for a picture at Goa airport last week, It took me down memory lane effortlessly.. to my days as a Naval Cadet.. when I had enlisted for the NCC! Delightfully nostalgic it was!#GoaDiaries #HappyNavalDay pic.twitter.com/n8WAQ4nRad
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 4, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.