AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Ramam: సీతారామం నుంచి మరో పాత్ర.. కూల్ డ్రింక్ తాగుతున్న ఇతగాడు ఎవరో గుర్తుపట్టారా.?

అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు హన్ను రాఘవపూడి. తొలి సినిమాతోనే మంచి అభిరుచు కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Sita Ramam: సీతారామం నుంచి మరో పాత్ర.. కూల్ డ్రింక్ తాగుతున్న ఇతగాడు ఎవరో గుర్తుపట్టారా.?
Sita Ramam
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2022 | 8:30 AM

Share

అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు హన్ను రాఘవపూడి. తొలి సినిమాతోనే మంచి అభిరుచు కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు సీతారామం(Sita Ramam)అనే అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న ఈ సినిమాలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రష్మిక మందన్న ఈ సినిమా కాశ్మీరీ ముస్లీమ్ యువతీ పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ ‘సీతారామం’. అలాగే  ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు. ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా అక్కినేని సుమంత్ కనిపించనున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రను బాలాజీగా పరిచయం చేశారు. ఈ లుక్ లో కూల్ డ్రింక్ తాగుతున్న తరుణ్ భాస్కర్ చాలా ట్రెండీగా కనిపించారు. బాలాజీ పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో కూడా ఆసక్తికరంగా వుంది. ”బాలాజీ హై నా.. సబ్ సంభాల్ లేగా(బాలాజీ వున్నాడు.. అంతా చూసుకుంటాడు) అని తరుణ్ భాస్కర్ చెప్పిన డైలాగ్ ఆయన పాత్రపై క్యూరియాసిటీని పెంచింది. ‘సీతారామం’లోప్రతి పాత్ర కోసం మేకర్స్ తీసుకున్న శ్రద్ధ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్దమౌతుంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి