Fun Bucket Bhargav : ఫన్ బకెట్ భార్గవ్ కు 20 ఏళ్ళు జైలు శిక్ష..

టిక్ టాక్ లు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయినా వారిలో ఫన్ బకెట్ భార్గవ్ ఒకడు. ఆతర్వాత యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. కామెడీ స్కిట్స్, పంచ్ లు చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. ఈ క్రమంలోనే పలువురు అమ్మాయిలతో భార్గవ్ కు పరిచయం ఏర్పడింది. అయితే తనతో పాటు వీడియోలు చేసే ఓ 14 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు భార్గవ్.

Fun Bucket Bhargav : ఫన్ బకెట్ భార్గవ్ కు 20 ఏళ్ళు జైలు శిక్ష..
Fun Bucket Bhargav
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 10, 2025 | 5:58 PM

టిక్ టాక్ లు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయినా వారిలో ఫన్ బకెట్ భార్గవ్ ఒకడు. ఆతర్వాత యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. కామెడీ స్కిట్స్, పంచ్ లు చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. ఈ క్రమంలోనే పలువురు అమ్మాయిలతో భార్గవ్ కు పరిచయం ఏర్పడింది. అయితే తనతో పాటు వీడియోలు చేసే ఓ 14 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు భార్గవ్. యూట్యుబ్ వీడియోలు చేసే 14 ఏళ్ల బాలికను చెల్లి చెల్లి అని లోబరుచుకున్నాడు. అనంతరం ఆ బాలిక గర్భం దాల్చింది.దాంతో 2021 ఏప్రిల్ 16న బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేప‌ట్టిన పోలీసులు భార్గవ్‌ను ‘దిశ’, ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడితో పని చేసిన అమ్మాయిల వల్లే భార్గవ్‌కు పేరొచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా గౌరవించడని, అతనో వుమెనైజర్‌ అంటూ కొందరు అమ్మాయిలు పేర్కొన్నారు.

కాగా మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో ఫ‌న్ బ‌కెట్ భార్గ‌వ్‌కి 20 ఏళ్ళు జైలు శిక్ష ప‌డింది. దీనిపై నేడు విచార‌ణ జ‌రిపిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు భార్గ‌వ్‌కి 20 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్షతో పాటు బాధిత బాలిక‌కు రూ.4 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలంటూ తీర్పును వెల్ల‌డించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి