Telugu Actress: ఈ సీరియల్ నటీమణుల్లో ఎవరి పారితోషకం ఎక్కువ అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో సినిమా నటీనటులకు సమానంగా క్రేజ్ సంపాదిస్తున్న సీరియల్ నటీమణులు ఎవరు..? సీరియల్స్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది ఎవరో తెలుసా?

తెలుగు లోగిళ్లలో సీరియల్స్‌దే డామినేషన్. మీరు రోజంతా ఏమైనా చూస్కోండి.. 7 నుంచి 10 వరకు టీవీ రిమోటా మాకు ఇవ్వాల్సిందే అనేస్తారు లేడీస్. ఇక ఒక్కొక్కరు ఒక్కో ఛానల్‌లోని కంటెంట్‌కు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా తగ్గింది కానీ.. ఒకప్పుడు అయితే సీరియల్స్ సినిమాలను డామినేట్ చేసేవి. కంటెంట్‌తో పాటు ఆర్టిస్టులు పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండేది. రీసెంట్ టైమ్స్‌లో బ్లాక్ బాస్టర్ అయిన సీరియల్ ఏంటి అంటే 100కు 90 మంది కార్తీక దీపం అనే చెబుతారు. ఇందులోని వంటలక్క, డాటర్ బాబు క్యారెక్టర్స్ తెలుగు రాష్ట్రాల్లో తెగ ఫేమస్. వంటలక్క రోల్ చేసిన ప్రేమి విశ్వనాథ్..కు తెలుగు లేడీస్ అంతా బిగ్ ఫ్యాన్స్.
ఇక వివిధ సీరియల్స్‌లో లీడ్ రోల్స్ పోషిస్తున్న మేఘనా లోకేశ్, నవ్య స్వామి, సుజిత వంటి వారిని కూడా వీక్షకులు బాగా లైక్ చేస్తారు. అయితే వీరి రెమ్యూనరేషన్ కూడా నెక్ట్స్ లెవల్‌కి చేరిందన్న టాక్ నడుస్తుంది. కార్తీకదీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ రోజుకు సుమారు రూ.30 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక నటి సుజిత రోజుకు రూ.25 వేల వరకు పారితోషకం తీసుకుంటుందని టాక్.
ఇకప్పుడు సిల్వర్ స్క్రీన్ క్వీన్స్ కస్తూరి శంకర్, రాశి, సుహాసినిలు ఇప్పుడు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. వారు కూడా రోజుకు రూ.25 వేల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. గృహలక్ష్మి సీరియల్లోని తులసి క్యారెక్టర్‌తో నటి కస్తూరి శంకర్‌కు సూపర్ ఫేమ్ వచ్చింది. ఇక అర్చన అనంత్,అనిలా శ్రీకుమార్, శోభా శెట్టి లాంటివారు ఒక్కరోజు కాల్షీటుకు రూ.15 వేల రెమ్యూనరేషన్‌ను తీసుకుంటున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.