Tollywood: టాలీవుడ్‌కు షాక్.. పెద్ద సినిమాలకు బ్రేక్.. రీజన్ ఇదే.
టాలీవుడ్ కు మరోసారి షాక్ తగిలింది. లాక్ డౌన్ తో ఏర్పడిన సంక్షోభాం నుంచి గట్టెక్కడానికి నిర్మాత మండలి తీవ్రంగా ప్రయతింస్తోంది. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక కమిటీ ప్రమేయం లేకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
టాలీవుడ్(Tollywood)కు మరోసారి షాక్ తగిలింది. లాక్ డౌన్ తో ఏర్పడిన సంక్షోభాం నుంచి గట్టెక్కడానికి నిర్మాత మండలి తీవ్రంగా ప్రయతింస్తోంది. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక కమిటీ ప్రమేయం లేకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఏర్పడ్డ పరిస్థితులు, జోరుగా జరుగుతున్న ఓటీటీ రిలీజుల నేపథ్యంలో ప్రొడ్యుసర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ ను నిలిపివేయాలని నిర్ణయించారు ప్రొడ్యుసర్స్. దాంతో పెద్ద సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ పడనుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతోన్న సినిమాలన్నీ పెద్ద హీరోలవి కడవం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తెరకెక్కుతోన్న బడా మూవీస్ లో .. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా రానుంది.
అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా, ప్రాజెక్ట్ కే , మారుతి సినిమాలకు బ్రేక్ పడనుంది. అలాగే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రానున్న పుష్ప2, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న మహేష్ 28 సినిమా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 107, అలాగే రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో రానున్న సినిమా, దళపతి విజయ్, వంశీపైడిపల్లి సినిమా, ధనుష్ సార్, విజయ్ దేవరకొండ ఖుషి, సమంత యశోద, అక్కినేని అఖిల్ ఏజెంట్ లాంటి సినిమాలకు బ్రేక్ పడనుంది. దాంతో స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్‌లో విడుదలైన 10 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని సూచింది ప్రొడ్యూసర్స్ గిల్డ్ . సుమారు బడ్జెట్‌తో తీసిన సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని తేల్చి చెప్పింది.