AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha Menon: ఆ వార్తల్లో అస్సలు నిజం లేదన్న భీమ్లానాయక్ బ్యూటీ

అందాల భామ సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా తో హీరోయిన్  గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది.

Samyuktha Menon: ఆ వార్తల్లో అస్సలు నిజం లేదన్న భీమ్లానాయక్ బ్యూటీ
Samyuktha Menon
Rajeev Rayala
|

Updated on: Jul 27, 2022 | 7:03 AM

Share

అందాల భామ సంయుక్త మీనన్(Samyuktha Menon) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా తో హీరోయిన్  గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. భీమ్లానాయక్ సినిమా రానా భార్య పాత్రలో నటించి మెప్పించింది సంయుక్త. అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో సంయుక్తకు వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి చిన్నదానికి.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సార్ సినిమాలో చేస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తో ధనుష్ తెలుగులో స్ట్రైట్ గా సినిమా చేస్తున్నాడు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమాలో నటిస్తుంది సంయుక్త. ఈ హిస్టారికల్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సంయుక్త మీనన్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో సంయుక్త కు అవకాశం దక్కిందని గత కొద్దిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడో సినిమా ఇది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా పూజాహెగ్డే తో పాటు మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల పై సంయుక్త మీనన్ స్పందించింది. మహేష్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. `మహేష్-త్రివిక్రమ్ సినిమాలో నేను ఉన్నాను అన్నది స్వీట్ రూమర్ అంటూ కొట్టిపడేసింది సంయుక్త.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్