AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sirivennela Sitarama Sastri: ‘తెల్లారింది లెగండోయ్‌..’ అంటూ సింగర్‌గా మారిన సిరివెన్నెల.. ఆయన పాటే ఓ మంత్రం..

ప్రేమగీతమైన.. విరహగాత్రమైనా.. దేశభక్తి గేయమైనా.. విప్లవ గీతమైనా.. సందర్భం ఏదైనా కావొచ్చు.. ఆయన రాసిన పాటలో పదాలు హృదయాన్ని తాకుతాయి. కాలానికి తగ్గట్టుగా పాటలు రాసుకుపోయే..

Sirivennela Sitarama Sastri: ‘తెల్లారింది లెగండోయ్‌..’ అంటూ సింగర్‌గా మారిన సిరివెన్నెల.. ఆయన పాటే ఓ మంత్రం..
Tellarindi Legando Kokkorok
Sanjay Kasula
|

Updated on: Nov 30, 2021 | 7:06 PM

Share

ప్రేమగీతమైన.. విరహగాత్రమైనా.. దేశభక్తి గేయమైనా.. విప్లవ గీతమైనా.. సందర్భం ఏదైనా కావొచ్చు.. ఆయన రాసిన పాటలో పదాలు హృదయాన్ని తాకుతాయి. కాలానికి తగ్గట్టుగా పాటలు రాసుకుపోయే పద్దతి ఆయన సొంతం. తెలుగు గుండెల్లో ఆయన రాసిన పాటలెన్నో చెరగని ముద్ర వేశాయి. ప్రేమ పూజారికి ఆయన పాట రసామృతం.. ఓటమితో కుంగిపోతున్న మనసుకు ఆయన పాటే ఓ మంత్రం.. ఓ తంత్రం.. ఓ ఔషధం. దేశం మీద ప్రేమని తన పదాలతో గుండెల్లో నింపేస్తారాయన.. ఆయన రాసిన ప్రతి పాట ఓ ఆణిముత్యంగా మారింది.

సిరివెన్నెల కవి మాత్రమే కాదు అద్భుతమైన గాయకుడు కూడా .. ‘కళ్లు’ చిత్రంలో ‘తెల్లారింది లెగండోయ్‌..’  అంటూ పాడిన పాట సూపర్‌ హిట్టయ్యింది. తాను రాసిన పాటను తానే పాడి మెప్పించారు సిరివెన్నెల.

“తెల్లారింది లెగండోయ్‌ కొక్కురోక్కో.. మంచాలింక దిగండోయ్‌ కొక్కురోక్కో..  పాములాంటి సీకటి పడగ దించి పోయింది.. భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి.. సావు లాటి రాతిరి సూరు దాటి పోయింది.. భయం నేదు భయం నేదు సాపలు సుట్టేయండి.. ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిసింది.. మూసుకున్న రెప్పలిడిసి సూపు లెగరనీయండి..” అంటూ ఈ పాట సాగిపోతుంది. ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోతుంది. తన అద్భుత రచనలతో వినోదంతో పాటు, ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించిన గొప్ప రచయిత కూడా మన సిరివెన్నెల సీతా రామయ్య.

“అందరిలో ఉన్నా.. ఒంటరిగా బతుకుతున్నా.. ఓ యువకుడి కథ కోసం ‘జగమంతా కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’ అంటూ తాత్వికతను తన కలం ద్వారా పంచిపెట్టారు. ఇక అమ్మాయి అల్లరిని ‘చంద్రుడిలో ఉండే కుందేలు కిందకొచ్చిందా… కిందకొచ్చి నీలా మారిందా’ అని భావుకతకు తనదైన పదాలతో కలం సిరాను ఒలకబోసారు..‘జామురాతిరి… జాబిలమ్మా..’ అంటూ జోల పాడి హాయిగా నిద్రపుచ్చి చెప్పకుండానే వెళ్లిపోయారు. ఆ పాటలు విన్న దేవుడికి కన్నుకుట్టిందేమో.. సీతారామయ్య..! ఇక చాలా నా వద్దకు రావయ్యా.. అంటూ తీసుకెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి: Sirivennela Sitarama Sastri: జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి సిరివెన్నెల..

Green Peas Benefits: బఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..