Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల కన్నుమూసింది అందుకే.. కిమ్స్ వైద్యుల ప్రకటన.. అంత్యక్రియలు రేపే!
వెండితెర సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా న్యూమోనియాతో
వెండితెర సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఈనెల 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్న కిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు సిరివెన్నెల ఆరోగ్యాన్ని పరీశిలిస్తూ వచ్చారు. కాగా.. సిరివెన్నెల ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. సిరివెన్నెల చనిపోవడానికి గల కారణాలను ఆయనకు చికిత్స అందించిన కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావు మీడియాకు వివరించారు.
సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయనకు సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. వారం క్రితం మరోవైపు ఊపిరితిత్తుకి క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం తీసేశారు. ఆ తర్వాత రెండ్రోజులు బాగానే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అడ్వాన్స్‌డా ట్రీట్మెంట్ కోసం కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇకకడ రెండ్రోజులు వైద్యం అందిస్తే కాస్త రికవరీ అయ్యారు.. ప్రికాస్టమీ కూడా చేశాం. 45 సాతం ఊపిరితిత్తు తీసేశాం. కాబట్టి మిగిలిన 55 శాతం ఊపిరితిత్తుకు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆక్సినేషన్ సరిగా లేక ఎక్మో మిషన్ పై పెట్టాం. సిరివెన్నెల గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. ఎక్మో మిషన్ పై ఉన్న తర్వాత.. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ కావడంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకింది. దీంతో ఈరోజు 4 గంటల 7 నిమిషాల ప్రాంతంలో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు అని కిమ్స్ హాస్పిటల్ ఎండీ భాస్కర రావు మీడియాకు తెలిపారు.
ఇదిలా ఉంటే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలను రేపు ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు సిరివెన్నెల నివాసానికి ఆయన భౌతికకాయం ఉండనుంది.. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం ఉదయం 7 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు సిరివెన్నెల భౌతికకాయం తరలిస్తారు. ఇక రేపు ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
Sirivennela Seetharama Sastri: తెలుగు సాహిత్యం మూగబోయినట్టుగా.. పాట ప్రయాణం ఆగిపోయింది..