AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sirivennela Seetharama Sastry: సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి స్వర్గద్వారాల వైపు సాగిపోయారు.. కన్నీటి వీడ్కోలు..

టాలీవుడ్‏లో తీవ్ర విషాదం నెలకొంది. వెండితెర పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో

Sirivennela Seetharama Sastry: సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి స్వర్గద్వారాల వైపు సాగిపోయారు.. కన్నీటి వీడ్కోలు..
Megastar
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2021 | 6:33 PM

Share

టాలీవుడ్‏లో తీవ్ర విషాదం నెలకొంది. వెండితెర పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెలతో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు.. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.. మిత్రమా.. అంటూ మెగాస్టార్ చిరంజీవి బావోధ్వేగానికి గురయ్యారు.

ట్వీట్..

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆరు రోజుల క్రితం ఆసుపత్రిలో జాయిన్ కావడానికి వెళ్తున్న సమయంలో ఆయనతో మాట్లాడానని.. తన ఆరోగ్యం బాగాలేదని.. ఇద్దరం కలిసి మద్రాసు వెళ్లి అక్కడ జాయిన్ అవ్వమని చెప్పాను.. మిత్రమా.. ఈరోజు ఇక్కడ జాయిన్ అవుతాను.. నెలాఖరులోపు వచ్చేస్తాను.. నువ్వు అన్నట్టుగానే అప్పటికీ ఉపశమనం రాకపోతే.. మనిద్దరం కలిసి వెళ్దాం అన్నారని చిరంజీవి తెలిపారు.

అలా వెళ్లిన మనిషి.. ఇలా జీవం లేకుండా వస్తారని ఊహించలేకపోయానని.. ఆసుపత్రిలో చేరిన రోజే ఫోన్ చేస్తే ఉత్సాహంగా మాట్లాడారు.. తిరిగి వస్తారనుకున్నా.. ఎప్పుడూ కలిసిన అప్యాయంగా మిత్రమా అంటూ పలకరిస్తూ మాట్లాడతారని.. తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. వేటూరి గారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలు ఈ తరానికి అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల అని తెలిపారు. సిరివెన్నెల లాంటి వ్యక్తిని కోల్పోతే గుండెంతా బరువెక్కి పోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని.. సాహిత్య లోకానికి అన్యాయం చేసి వెళ్లిపోయారని తెలిపారు. భౌతికంగా సిరివెన్నెల దూరమైన.. ఆయన పాట రూపంలో ఇంకా బతికే ఉన్నారని తెలిపారు.

ట్వీట్..

సిరి వెన్నెల సీతారామశాస్త్రి… నాకు అత్యంత సన్నిహితుడు… సరస్వతీ పుత్రుడు… విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది… ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ భావోద్వేగానికి గురయ్యారు మోహన్ బాబు..

ట్వీట్..

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.

ట్వీట్..

Also Read: Sirivennela Seetharama Sastri: తెలుగు సాహిత్యం మూగబోయినట్టుగా.. పాట ప్రయాణం ఆగిపోయింది..

Sirivennela Sitarama Sastri: జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి సిరివెన్నెల..